టీ20 వరల్డ్ కప్లో పాల్గొంటున్న జట్లకు గాయాల బెడద వెంటాడుతూ ఉంది. టోర్నీ మొదలవ్వకముందే ఆయా జట్లకు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. టోర్నీ స్టార్ట్ అయ్యాక కూడా ప్లేయర్లు గాయాలపాలవుతూ..టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలుగుతున్నారు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక ఇప్పటికే టోర్నీకి దూరం కాగా...ఆ జట్టులోని మరో సార్ట్ బౌలర్ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి తప్పుుకున్నాడు.
గాయంతో చమీర ఔట్..
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర యూఏఈతో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. అతని చీలమండకు గాయమైంది. దీంతో ఆ మ్యాచ్లో బౌలింగ్ కోటాను కూడా పూర్తి చేయలేదు. నాలుగో ఓవర్ అయిదో బంతి వేసే సమయంలో కండరాలు పట్టేశాయి. దీనితో ఆ ఓవర్‌ను పూర్తి చేయలేకపోయాడు. గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు.
శ్రీలంకు ఎదురుదెబ్బ...
యూఏఈ మ్యాచ్‌లో దుశ్మంత చమీర మూడు వికెట్లు పడగొట్టాడు. యూఏఈ కెప్టెన్ సీపీ రిజ్వాన్, వికెట్ కీపర్ ఆర్యన్ లక్రా, ముహమ్మద్ వసీం వికెట్లను తీశాడు. ప్రస్తుతం దుష్మంత చమీర ...లంక జట్టులో కీలక బౌలర్గా ఉన్నాడు. దిల్షాన్ మధుశంక గాయం వల్ల వైదొలగడంతో..లంక బౌలింగ్ విభాగానికి చమీర నాయకత్వం వహిస్తాడని భావించారు. కానీ..అతను కూడా గాయంతో వరల్డ్ కప్ నుంచి వైదొలగడం..లంకేయులకు పెద్ద దెబ్బ.
