శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట లభించింది. ఆయనపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వీగిపోయింది. తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) ఎంపీ సుమంథిరన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేశారు. దీంతో ఈ తీర్మానం వీగిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేయడంతో తీర్మానం వీగిపోయింది. 

దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైన గొటబయ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ తాజా పరిణామం అధ్యక్షుడికి ఉపశమనం కలిగించినట్లయ్యింది. నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘె బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంక పార్లమెంటు తొలిసారి సమావేశమైంది. 

ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఇటీవల చోటు చేసుకున్న ఆందోళనలు హింసకు దారితీశాయి. దీంతో ప్రధానమంత్రిగా ఉన్న మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రణిల్ విక్రమసింఘె బాధ్యతలు స్వీకరించారు. దేశాన్ని రక్షించడమే తన కర్తవ్యమన్న ఆయన కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

మరిన్ని వార్తల కోసం..

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం