దేశంలోనే ఏకైక దేవాలయం.. నీళ్లలో గణపతి..రంద్రం ద్వారా దర్శించుకోవాలి

దేశంలోనే ఏకైక దేవాలయం.. నీళ్లలో గణపతి..రంద్రం ద్వారా దర్శించుకోవాలి

వినాయకుడనగానే  భారీ విగ్రహాలు, అందమైన రూపాలు. చూస్తూ ఉండిపోవాలం గణపయ్యది. కానీ ఇక్కడే రంధ్రంలోంచే దర్శించుకోవాలి. విగ్రహం కూడా సగం వరకు నీళ్లలో ఉంటుంది.  కర్ణాటకలో ఉన్న ఈ వినాయకుడిని జలాధివాస గణపతిగా పిలుస్తారు. సర్వ సిద్ది ప్రదాయక' అని భక్తా విశ్వసిస్తారు.

మంగళుడు నుంచి దాదాపు 300 ఓ.మీ దూరంలో ఉన్న అనెగుడ్డి అనే పట్టణానికి 'అనే' (ఏనుగు), 'గుడ్డి' ఇ (కొండ) అని అర్థం. పురాణాల ప్రకారం, ఈ ప్రాంతం కరువు, వర్షాభావ పరిస్థితులలో ఉన్నప్పుడు, వరుణదేవుడిని శాంతింపజేయడానికి అగస్త్య మహర్షి యాగం చేసాడు. ఈ సమయంలో, కుంభాసురుడు అనే రాక్షసుడు ఋషులను వారి ప్రార్థనలకు భంగం కలిగించాడు. ఆ రాక్షసుడిని ఓడించడానికి, పాండవుల భీమసేనుడు వినాయకుడిని ప్రార్థించి, అతనిని చంపడానికి ఆయుధాన్ని పొందాడు. ఈ ప్రదేశానికి కుంభాషి అనే పేరు కూడా ఉంది. కుంభాసుర అనే రాక్షసుడి పేరు నుంచే ఈ పేరు వచ్చింది. ఆకర్షణీయమైన ముఖమంటపం, తీర్థమంటపాలతో వాస్తు ప్రకారం గ్రానైటిక్ తో ఈ దేవాలయం పునర్నిర్మించబడింది. ఇక్కడి వినాయకుడి గణపతి విగ్రహం సుమారు 3 అడుగులు ఎత్తు ఉంటుంది. విగ్రహం చుట్టూ నల్లరాతి శిల్పం ఉంది. వినాయుడి మెడ వరకు ఎప్పుడూ నీరు ఉంటుంది. ఎదురుగా ఉన్న రంధ్రం ద్వారా వినాయకుడిని ప్రజలకు దర్శించుకోవచ్చు.

►ALSO READ | ఆరు నెలలకోసారి.. రంగులు మార్చే గణపతి ఎక్కడంటే.?

ఎలా వెళ్లాలి..

కర్ఱాటకలోని ఉడిపి జిల్లా కుండాపుర పట్టణంలో  గడ్డట్టు దేవాలయం ఉంది . కుందాపురా రైల్వే స్టేషన్ లో దిగి వెళ్లొచ్చు. అలాగే మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కుండాపుర పట్టణానికి చేరుకోవచ్చు. 

 దేశంలోనే ఏకైక జలాధివాస ఆలయం

గుడ్డట్టు వినాయక దేవాలయం కర్ణాటక రాష్ట్రం, ఉడిపి జిల్లాలోని కుందాపుర ప్టటణంలో ఉన్న వినాయక దేవాలయం. భారతదేశంలోని ఏకైక జలాదివాస గణపతి తేవాలయమిది. మూడు అడుగుల వినాయకుడి విగ్రహం రాతి నుంచి ఉద్భవించిందని నమ్ముతారు.