రష్మికను కూడా పక్కకు నెట్టేసింది.. శ్రీలీల క్రేజా మజాకా

రష్మికను కూడా పక్కకు నెట్టేసింది.. శ్రీలీల క్రేజా మజాకా

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల(Sreeleela) హవా నడుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్(Pawan kalyan), మహేష్ బాబు(Mahesh babu)తో సహా.. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఉన్నారు. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా శ్రీలీలవే అవడం విశేషం. అంతేకాదు.. రానున్న సినిమాల్లో కూడా ఇప్పటికే సెలెక్ట్ అయినా హీరోయిన్స్ ను తీసేసి మరీ శ్రీలీలను తీసుకుంటున్నారు మేకర్స్. 

ఇక ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది శ్రీలీల. యూత్ స్టార్ నితిన్(Nithin) హీరోగా వెంకీ కుడుములు(Venky kudumula) దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మికా మందనా(Rashmika mandanna) ను హీరోయిన్ గ అనుకున్నారు మేకర్స్. నితిన్, వెంకీ, రష్మిక.. ఈ కాంబోలో ఇప్పటికే భీష్మ(Bhishma) సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ కాంబోలో మరోసారి హిట్ కోసం కలుస్తున్నారని అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా ఈ సినిమా నుండి రష్మికను తీసేసి లేటెస్ట్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్. ఈ క్రేజ్ ఏంటి శ్రీలీల.. ఇక వేరే హీరోయిన్స్ ను ఇండస్ట్రీలో ఉండనిచ్చేలా లావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.