
సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సోహైల్ మాట్లాడుతూ ‘పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కింది అనుకుంటున్నా. సినిమాకొచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారు. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది. పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి థియేటర్‌కి వెళితే.. ఏ ఒక్కరూ నెగిటివ్‌గా చెప్పలేదు’ అన్నాడు. సక్సెస్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్ రూప, దర్శకుడు శ్రీనివాస్.
అప్పిరెడ్డి మాట్లాడుతూ ‘ఇది కొత్త కథ. సెన్సిటివ్ సబ్జెక్ట్. కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా మొత్తం సినిమా రిజల్ట్ వేరేగా ఉంటుంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. మహిళా ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు’ అని చెప్పారు.