
కొల్లాపూర్, వెలుగు : ఉచిత వేరుశనగ విత్తనాల కోసం కొల్లాపూర్, పాన్ గల్ మండలాలకు చెందిన రైతులు ఈనెల 29 నుంచి అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ, సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీల సహకారంతో రెండు మండలాలకు చెందిన 2 వేల మంది వేరుశనగ రైతులకు ఒక ఎకరానికి సరపడా విత్తనాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు బ్యాంక్, రెండు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని కొల్లాపూర్ లో రత్నగిరి ఫౌండేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.