సమాజంలో గౌరవం దక్కని వాళ్లకు అంకితం

సమాజంలో గౌరవం దక్కని వాళ్లకు అంకితం

తమలాంటి వాళ్లని తక్కువగా చూసే సమాజానికి తమ టాలెంట్​ చూపించాలనుకుంది. అది కూడా అందాలపోటీల్లో కిరీటం గెలిచి మరీ చెప్పాలనుకుంది. ఆ రోజు రానే వచ్చింది. ‘మిస్​ ట్రాన్స్​ గ్లోబల్​–2021’ టైటిల్​ గెలిచింది.  ఈ టైటిల్​ సాధించిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘నిత్యం అవమానాలు పడ్డవాళ్లకి,  సమాజంలో గౌరవం దక్కనివాళ్లకి ఈ విజయం అంకితం’ అని టైటిల్​ గెలిచిన తర్వాత తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసింది. ఆమె పేరు శృతి సితార. కేరళకు చెందిన ట్రాన్స్​జెండర్.

‘‘మేము అందరిలాంటి వాళ్లమే. సమాజంలో మేము కూడా భాగమే. ట్రాన్స్​జెండర్లు చాలామంది తమ బాధ చెప్పుకునేందుకు ముందుకు రావట్లేదు. అలాంటివాళ్లకు ధైర్యం చెప్పి, నచ్చినట్టుగా బతికేలా చేస్తాం. ట్రాన్స్​ కమ్యూనిటీలో నమ్మకాన్ని పెంచేందుకు ఈ టైటిల్​ పనికొస్తుంది. నా సక్సెస్​ జర్నీలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ”అని చెప్పింది. శ్రుతి కేరళలో సోషల్​ జస్టిస్​ డిపార్ట్​మెంట్​లో ప్రాజెక్ట్​ అసిస్టెంట్​గా పనిచేసింది​. ఎల్జీబీటీ(లెస్బినియన్​, గే, బై సెక్సువల్​, ట్రాన్స్​జెండర్​) హక్కుల కోసం తన ఫ్రెండ్స్​తో కలిసి ‘ది కలైడోస్కోప్​’ ఆన్​లైన్​ క్యాంపెయిన్​ నడిపిస్తున్న ఈమె మోడల్​, ఆర్టిస్ట్​ కూడా. ‘మిస్​ ట్రాన్స్​ గ్లోబల్​’ అనేది ట్రాన్స్​జెండర్లకి సంబంధించిన ఇంటర్నేషనల్​ ఆన్​లైన్ అందాల పోటీ. ​ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్​ కమ్యూనిటీల హక్కుల గురించి అవేర్​నెస్​ కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం