హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ సేవలు అందించే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ (ఎస్ఎస్ఈ) అమెరికా మార్కెట్కు తొలి 175 ఎంవీఏ, 345 కేవీ ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎగుమతి చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ నైనీ తయారీ కేంద్రంలో ఈ భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేశామని కంపెనీ సీఈవో శరత్ చంద్ర తెలిపారు.
రాబోయే 18 నెలల్లో నైనీ ప్లాంటు నుంచి రూ.500–రూ.600 కోట్ల విలువ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని, యూరప్ మార్కెట్లకు కూడా వెళ్తామని వెల్లడించారు. ప్రస్తుతం సంస్థకు 48 వేల ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సామర్థ్యం ఉండగా, రాబోయే సంవత్సరాల్లో దీనిని 1.10 లక్షల ఎంవీఏలకు పెంచాలని భావిస్తోంది.
