
- పార్లమెంటుకు వెల్లడించిన కేంద్రప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో 40శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. గత నాలుగేండ్లలో ఇదే అత్యధికమని తెలిపింది.
సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఎయిమ్స్ లలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 2,761 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో(462), భువనేశ్వర్ లో (103), జోధ్ పూర్ లో (186), రిషికేష్ (147), మల్కన్ గిరి (158) లో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.