ఆర్మ్​డ్ కానిస్టేబుల్స్​ - త్వరలో నోటిఫికేషన్​

ఆర్మ్​డ్ కానిస్టేబుల్స్​  - త్వరలో నోటిఫికేషన్​

స్టాఫ్​ సెలెక్షన్ కమిషన్​ సెంట్రల్​ ఆర్మ్​డ్​ ఫోర్సెస్​లో కానిస్టేబుళ్ల రిక్రూట్​మెంట్​కు కసరత్తు చేస్తోంది. ఎస్​ఎస్​సీ ఇయర్​ క్యాలెండర్​ ప్రకారం మరో ఐదు రోజుల్లో అఫీషియల్​గా నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనుంది. టెన్త్​ క్వాలిఫికేషన్​తో సెంట్రల్​ కొలువుకు అవకాశం ఉన్న ఈ నియామక ప్రక్రియ వివరాలు ఈ వారం..
బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ తదితర సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​తోపాటు, ఎన్​ఐఏ, స్పెషల్​ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్​లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్​(జనరల్​ డ్యూటీ) పోస్టుల రిక్రూట్​మెంట్​కు స్టాఫ్​ సెలెక్షన్​ కమిషన్​ మార్చి 25న (క్యాలెండర్​ ప్రకారం) నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనుంది.  2018లో సుమారు 60,210 పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్​ ఇచ్చింది.  వీటి ఫైనల్​ రిజల్ట్​ మొన్న జనవరిలో డిక్లేర్​ చేశారు. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్​లో కూడా ఖాళీలు భారీగానే ఉండే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్​ పోలీస్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్(బీపీఆర్​డీ)​ 2020 డిసెంబర్​లో ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం..  సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​లో 1.27 లక్షల ఖాళీలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్​లో జరిగిన పార్లమెంట్​ సమావేశాల్లో కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ రాత పూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్​ఎఫ్​లో 28,926 , సీఆర్​పీఎఫ్​లో 26,506, సీఐఎస్​ఎఫ్​లో 23,906, ఎస్​ఎస్​బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్​లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో ఎక్కువ మొత్తంలో కానిస్టేబుల్​ స్థాయి పోస్టులే ఉన్నట్లు తెలిపారు. 

సెలెక్షన్​ ప్రాసెస్​ 

కంప్యూటర్​ బేస్డ్​ ఆన్​లైన్​ ఎగ్జామ్​, ఫిజికల్​ టెస్ట్, మెడికల్​ ఎగ్జామ్​​ ఇలా ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. కంప్యూటర్​ బేస్డ్​ ఆన్​లైన్​ టెస్ట్​ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఎగ్జామ్​ డ్యురేషన్​ గంటన్నర. జనరల్, ఎక్స్​సర్వీస్​మెన్​కు కటాఫ్​ మార్క్స్​ 35 శాతం కాగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 33 శాతం.

సిలబస్

జనరల్​ ఇంటెలిజెన్స్​& రీజనింగ్​: అనాలజీ, సిమిలారిటీస్​, డిఫరెన్సెస్​, స్పేషియల్​ విజువలైజేషన్​, ఓరియెంటేషన్​, విజువల్​ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్​, రిలేషన్​షిప్​ కాన్సెప్ట్​లు,అర్థిమెటిక్​ రీజనింగ్​, ఫిగర్​ క్లాసిఫికేషన్​, అర్థిమెటిక్​ నెంబర్​ సిరీస్​, నాన్​ వెర్బల్​ సిరీస్​, కోడింగ్​ డికోడింగ్​ల నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్​ ఉంది.

జనరల్​ నాలెడ్జ్​ & జనరల్​ అవేర్​నెస్

 చుట్టూ ఉన్న ఎన్విరాన్​మెంట్​, కరెంట్​ ఎఫైర్స్​తోపాటు అభ్యర్థి జనరల్​ అవేర్​నెస్​ను పరీక్షించే స్థాయి ప్రశ్నలు ఇస్తారు. భారత్​ పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫి, ఎకానమి, జనరల్​ పాలిటీ, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతికత, పరిశోధనలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

సంఖ్యావ్యవస్థ, పూర్ణాంకాలు, దశాంశాలు, భిన్నాలు, ప్రాథమిక గణిత ప్రక్రియలు, పర్సంటేజీలు, నిష్పత్తి అనుపాతం, లాభ నష్టాలు, వడ్డీ, డిస్కౌంట్​, కాలం–దూరం, కాలం–నిష్పత్తి, కాలం–పని తదితర బేసిక్​ గణిత అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు 4 నుంచి 10 వరకు అకడమిక్​ బుక్స్​ ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.

ఇంగ్లిష్​/హిందీ

ఇంగ్లిష్​ లేదా హిందీ భాషలో అభ్యర్థికి ఉన్న అవగాహన స్థాయిని పరీక్షిస్తారు. బేసిక్​ కాంప్రహెన్షన్​పై ప్రశ్నలు ఉంటాయి. ​

ఎగ్జామ్​ ప్యాటర్న్​
సబ్జెక్ట్​                                           ప్రశ్నలు    మార్క్స్​
జనరల్​ ఇంటెలిజెన్స్​& రీజనింగ్​               25    25
జీకే & జనరల్​ అవేర్​నెస్​                        25    25
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్​                     25    25
ఇంగ్లిష్​/హిందీ                                      25    25


ఫిజకల్​ టెస్ట్​


క్రైటేరియా    పురుషులు    మహిళలు
పరుగు​      5 కి.మీ–24 ని    1.6 కి.మీ– 8.5 ని
ఎత్తు              1.70 మీ    1.57 మీ
చెస్ట్​                     80/5    –

ముఖ్య సమాచారం
పోస్టులు: కానిస్టేబుల్​, రైఫిల్​మెన్​
శాలరీ: రూ.21,700 – 69,100 దరఖాస్తులు: ఆన్​లైన్​
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్​ పాసై ఉండాలి
వయసు: నోటిఫికేషన్​ రిలీజ్​ చేసిన తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్​ ఫీజు: రూ.100(ఎస్సీ,ఎస్టీ, ఎక్స్​ సర్వీస్​మెన్​లకు ఫీజు లేదు)
నోటిఫికేషన్​ తేదీ: మార్చి 25
వెబ్​సైట్​: ssc.nic.in