అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ నుండి షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ .ప్రస్తుతం సన్ ఆఫ్ సర్దార్ 2 లండన్‌లో షూటింగ్ జరుగుతుంది.ఇక ఆపై ఇండియాలో నెక్స్ట్ షెడ్యూల్ షురూ కానుంది. కామెడీ, యాక్షన్ తో సర్దార్ రాబోతున్నాడు. సన్ ఆఫ్ సర్దార్ 2 యొక్క జర్నీ షురూ అయింది. మీ బెస్ట్ విషెష్ మా టీంపై ఉండటం వల్లే నేడు ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి మృణాల్ లుక్ రివీల్ అయింది. ఇందులో పాటియాలా సూట్, హెవీ జ్యూలరీ ట్రెడిషనల్ పంజాబీ అమ్మాయి గెటప్‌లో కనిపిస్తోంది మృణాల్. అజయ్ దేవగన్, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్’కి ఇది సీక్వెల్. అప్పట్లో ‘మర్యాద రామన్న’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. గతంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించగా, ఈసారి మృణాల్‌ను తీసుకున్నారు. ఈ సీక్వెల్ కు విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తున్నారు.
జియో స్టూడియోస్ మరియు దేవ్ గణ్ ఫిలిమ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, N R పచిసియా మరియు ప్రవీణ్ తల్రేజా సంయుక్తంగా నిర్మించగా కుమార్ మంగత్ పాథక్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
అజయ్ దేవగన్ నుంచి చివరిగా వచ్చిన ఆరోన్ మే కహన్ దమ్ థా మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది.బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపు 7.75 కోట్లు మాత్రమే రాబట్టింది.
The laughter, the action, and the Sardaar swag—everything's about to get bigger! #SonOfSardaar2 is on the way! 🔥💥#JyotiDeshpande @ajaydevgn @nrpachisia @talrejapravin @KumarMangat @jiostudios @ADFFilms @danishdevgn pic.twitter.com/4V0XyWxKnA
— Jio Studios (@jiostudios) August 6, 2024