ప్రభుత్వాలు పల్లె బీమార్లు కూడా పట్టించుకోవాలె

ప్రభుత్వాలు పల్లె బీమార్లు కూడా పట్టించుకోవాలె

నేడు వరల్డ్ హెల్త్ డే…

ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరి హక్కు .అందరికీ ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీని కోసం ఊరి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ( పీహెచ్ సీ) బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలంటారు. అలాంటి గ్రామాలు ఆరోగ్యంగా ఉండాలంటే పీహెచ్ సీ ల పనితీరు మెరుగుపడాలి. రోగం వస్తే ట్రీట్మెంట్ చేయడంతోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని అయిపోకూడదు. ఆరోగ్యానికి సంబంధించి పల్లె ప్రజలకు సలహాలు, సూచనలు ఇచ్చే ఓ మంచి గైడ్ లా పీహెచ్ సీలు పనిచేయాలి.లాంగ్ రన్ లో గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచే హెల్త్ కేర్ సెంటర్లుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మారాలి. అవసరమైతే  అన్ని స్థాయిల్లో మిగతా ప్రభుత్వ శాఖలతో కలిసి సమన్వయంతో కలిసి పని చేయగలగాలి. పల్లెలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దేశం ఆరోగ్యంగా ఉంటే హెల్త్ కేర్ కోసం ప్రభుత్వాలు చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ ఆశయాలకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం 2017 లో రూపొందిం చిన జాతీయ ఆరోగ్య విధానంలో ప్రాథమిక ఆరోగ్యాన్నే ప్రధానాంశంగా చేసింది.

మనదేశంలో ఎక్కు వ శాతం మరణాలకు వైద్య సహాయం అందుబాటులో ఉన్నా, ఏడాదికి ఎనిమిది లక్షల మంది చనిపోతున్నట్లు సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం వైద్యంలో నాణ్యత లేకపోవడమే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ . దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, ఉప కేం ద్రాల్లో స్టాండర్ట్స్ లేకపోవడమే. 73 శాతం ఉప కేం ద్రాలు మారుమూల  గ్రామాలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. దీనికి తోడు పల్లె ప్రజల్లో 28 శాతం మందికి ట్రాన్స్ పోర్ట్  ఫెసిలిటీ అందుబాటులో లేదు. ఇలాంటి మరికొన్ని కారణాలతో ఊరి జనానికి వైద్య సేవలు అందాల్సిన స్థాయిలో అందడం లేదు.

దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది ‘ ఆశ’ ఆరోగ్య కార్యకర్తలకు తగిన శిక్షణ లేదు. వీరిలోకేవలం 22 శాతం మందికి మాత్రమే తమ డ్యూ-టీలకు సంబంధిం చి అవగాహన ఉందని సర్వేఫలితాలు వెల్లడిం చాయి. అంతేకాదు ఏవో కొన్నిరాష్ట్రాలు మినహా చాలా చోట్ల వీరికి తక్కు వఅమౌంట్ ఇస్తున్నారు. ‘ఆశ’ కార్యకర్తలకు మంచిట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాల పనితీరును మెరుగుపరచుకోవచ్చు.ఊళ్లల్లో పనిచేయడానికి చాల మంది డాక్టర్లుఉత్సాహం చూపడం లేదు. పల్లె ప్రాంతాల్లోపనిచేసేలా డాక్టర్లు ఒప్పించగలగాలి. మన దేశజీడీపీలో అతి తక్కు వ శాతం ఆరోగ్య రంగానికికేటాయిస్తున్నారు. ఈ కేటాయిం పులను పెం చా-ల్సిన అవసరం ఉంది. వీటిలో అధిక భాగం ప్రాథ-మిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడానికిఖర్చు పెట్టాలి. మెడికల్ కాలేజీల ప్రయారిటీలు కూడా మారాల్సిన అవసరం ఉంది.ల్త్ డే…

పీహెచ్ సీల్లో మందుల కొరత

అనేక రాష్ట్రా ల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందుల కొరత ఉంది. ఈ విషయాన్ని కాగ్ నివేదిక కూడా పేర్కొంది. అంతేకాదు ఈ కేంద్రాల్లో తగినంత సిబ్బంది కూడా లేరు. చాలా పీహెచ్ సీల్లో 24 నుంచి 38 శాతం సిబ్బంది కొరత ఉంది. పీహెచ్ సీల్లో పనిచేసే సిబ్బందికి వృత్తిపరంగా మెరుగైన శిక్షణ ఇవ్వాలి.

‑ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు,
                                                                                                                                         నెఫ్రాలజీ హెడ్, నిమ్స్,
                                                                                                                                                   హైదరాబాద్ .