అప్పులవేటలో రాష్ట్ర సర్కారు.. !

అప్పులవేటలో రాష్ట్ర సర్కారు.. !

గ్యారంటీ అప్పులపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ ఇయర్​ కావడంతో జనాలపై పన్నులు వేస్తే ఇంకా వ్యతిరేకత పెరుగు తుందని భావిస్తున్న రాష్ట్ర సర్కారు గ్యారంటీ అప్పులవేటలో పడింది. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేయాలని, వాటి గురించి గొప్పగా చెప్పుకోవాలని పబ్లిసిటీ ప్లాన్లు రెడీ చేస్తోంది. గ్యారంటీ అప్పులు తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్​ ఆదేశించినట్టు సమాచారం. కేబినెట్​ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. అన్ని శాఖలకు నిధుల సర్దుబాటుపై అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

అప్పులు వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు

‘‘ఇప్పటికే వివిధ టాక్స్​లు పెంచినం.. రిజిస్ట్రేషన్ చార్జీలు రెండుసార్లు పెంచాం. లిక్కర్​ రేట్లు పెంచాం. నేరుగా జనాలపై పన్ను వేసి బాదే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ టైంలో ఏం చేసినా నెగిటివ్​ అవు తది. భూములు అమ్ముతున్నం. అసైన్డ్​తోపాటు ఇత ర పట్టా భూములు తీసుకుని డెవలప్​మెంట్​ కింద రాబడి సమకూర్చుకుంటున్నం. ఈసారి ఎక్కువగా గ్యారంటీ అప్పులు రాలేదు. ప్రాజెక్టులతో పాటు ఇతరత్రా వాటికి గ్యారంటీ అప్పులు ఎట్లా తీసుకోవాలి? వాటిని ఎట్ల చెల్లించాలనే దానిపై రిపోర్ట్​ తయారు చేసుకుని ముందుకు పోవాలి. ఆ అప్పులు ఏమన్నా వస్తే కానీ వెల్ఫేర్​ యాక్టివిటీస్​ చేయలేం’’అని సీఎం అన్నట్లు తెలిసింది. కనీసం రూ.15వేల కోట్లు జన వరి చివరి లో గా తీసుకునేలా ప్లాన్​ చేయాలని కేబి నెట్​లో చర్చించినట్లు తెలిసింది. 

రోడ్లు వేయడానికీ లోన్లు

ఆర్​ అండ్​ బీకి అదనంగా కేటాయించిన రూ.1,865 కోట్లను.. నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా అప్పు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ రోడ్లపై వెళ్లే ప్రయాణికులకు టాక్స్​ వేసి.. చెల్లిస్తామనే పద్ధతిలో గ్యారంటీ అప్పు తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన గ్యారంటీ అప్పులు ప్రస్తుతం దాదాపు రూ.లక్షన్నర కోట్లు ఉన్నాయి. ఇష్టారీతిన గ్యారంటీలు ఇచ్చి.. వాటిని బడ్జెట్​లో నిధుల నుంచి చెల్లిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టాయి. చేస్తున్న అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారనేది స్పష్టత ఇస్తేనే లోన్లు ఇవ్వాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు గతంలోనే స్పష్టం చేసింది.

పబ్లిసిటీపై ఫోకస్​ చేయాలె

బీఆర్ఎస్​ పార్టీని దేశ స్థాయిలో విస్తరించాలని అను కుంటున్నందున పబ్లిసిటీ ఎక్కువగా చేయాలని మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి మధ్య తేడా చూపిస్తూ ప్రచారం చేయాలని, డెవలప్​మెంట్​ మీద ఎక్కువగా మాట్లాడాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు ఒక మంత్రి చెప్పారు. టీఆర్ఎస్​ పేరు మారడంతో కొంతమంది కన్ఫ్యూజ్​ అయ్యే చాన్స్​ ఉందని, బీఆర్ఎస్-టీఆర్ఎస్​ రెండూ ఒకటే అనే విషయం జనాల్లోకి విస్తృతంగా వెళ్లేలా చూడాలని చెప్పినట్లు తెలిసింది. అన్నింటినీ ప్రస్తావించకుండా.. కంటిన్యూగా ఇస్తున్న, చేస్తున్న రైతుబంధు, వడ్ల కొనుగోళ్లు వంటి వాటినే ఫోకస్​ చేయాలని సూచించారు. వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​లో ఉన్న ఇద్దరు మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది.