ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రస్థాయి యోగా పోటీలు సోమవారం నల్గొండలోని చిన వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న పోటీలకు వివిధ జిల్లాల నుంచి 120 మంది బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 130 మంది గర్ల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరుకానున్నారు. ట్రెడిషనల్, ఆర్టిస్ట్, రిథమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజు ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలు జరిగాయని యోగా అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోట సింహాద్రి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైదిరెడ్డి, ఆర్గనైజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, టీవైఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాంచందర్, జాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రాంరెడ్డి, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రధాన కార్యదర్శి రాయనబోయిన శ్రీను, సభ్యులు గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సంధ్య, రామ్మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల్లో రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలి

మిర్యాలగూడ, వెలుగు : ఉపాధి హామీ పనులు చేసే టైంలో ఆఫీసర్లు, కూలీలు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలని నల్గొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ ఆదేశించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు, శ్రీనివాసనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామాల్లో సోమవారం పర్యటించి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెక్రటరీలు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వర్క్ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులు, ఫైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏడు రిజిస్టర్లు, వంద శాతం జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోగవెల్లి వెంకటరమణ చౌదరి, మండల తనిఖీ అధికారి మక్బూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఏపీవో శిరీష, ఈసీ కళావతి పాల్గొన్నారు.

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి

హాలియా, వెలుగు : వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా నిడమానూరు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు  సంఘం జిల్లా కార్యదర్శి కున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తానని ఎన్నికల టైంలో చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు కేవలం 12 గంటలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. కేవీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణరెడ్డి, నల్లబోతు సోమయ్య, కందుకూరి కోటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురవయ్య, శేఖర్, వింజమూరి శివ పాల్గొన్నారు.

అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య

సూర్యాపేట, వెలుగు : ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం, అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటి వారు వేధించడంతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని బాపట్ల జిల్లా గాజులంకకు చెందిన సనక శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదే గ్రామానికి చెందిన వాసవి (27)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యాపేటలోని ఓ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అతడి తల్లి రమాదేవి కొంతకాలంగా వాసవిని వేధిస్తున్నారు. దీంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తుండడంతో మనస్తాపానికి గురైన వాసవి సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మందలించిందన్న కోపంతో భార్యను హత్య చేసిన భర్త

సూర్యాపేట, వెలుగు : మందలించిందన్న కోపంతో భార్యను రోకలి బండతో కొట్టి భర్త హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సామ్య భుక్యా తండాలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చివ్వెంల మండలం బాధ్యతండా పరిధిలోని సామ్య భుక్యాతండాకు చెందిన సక్కు (38), సైదా దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. సైదా తాగుడుకు బానిసై తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల కూతురుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పొదుపు చేసుకున్న డబ్బులతో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించారు. మిగిలిన రూ. 40 వేలను సైదా తన దగ్గరే పెట్టుకొని ప్రతిరోజు తాగుతుండేవాడు. ఈ విషయంపై ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో రోకలిబండతో సక్కు తలపై కొట్టడంతో ఆమె స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయింది. వెంటనే సైదా అక్కడి నుంచి పరారయ్యాడు. 

బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కారు ఢీకొని వ్యక్తి మృతి

మిర్యాలగూడ, వెలుగు : బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం వద్ద సోమవారం జరిగింది. రూరల్ పోలీసులు,  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ మండలం హఠ్యాతండాకు చెందిన ధీరావత్ మంగ్య (72) టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మిర్యాలగూడ నుంచి తండాకు వస్తున్నాడు. ఈ క్రమంలో కిష్టాపురం సమీపంలోకి రాగానే ఏపీ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే చనిపోయాడు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

నల్గొండ పట్టణంలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ కాలేజీ ఆవరణలో సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యువజన, క్రీడలు, కార్మిక, మెప్మా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మలను తీసుకొచ్చి పాటలు పాడుతూ ఆటలు ఆడారు. 

– వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ

రాష్ట్ర హక్కులను కేంద్రం లాక్కుంటోంది

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/నేరేడుచర్ల, వెలుగు : రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులను కేంద్రం లాక్కుంటోందని శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్లే సాధ్యం అవుతుందన్నారు. బీజేపీ తన ప్రయోజనాల కోసం 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిందని ఆరోపించారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్లను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి బాకీ లేకున్నా వివిధ కారణాలతో రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఈడీ, సీబీఐ ఆఫీసర్లు ఇంత దారుణంగా పనిచేయలేదని, ప్రస్తుతం జిల్లా స్థాయి లీడర్లను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మునుగోడులో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అలాగే నేరేడుచర్లలో ఎమ్మెల్యే సైదిరెడ్డితో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. 

బ్రహ్మంగారి గుట్ట అభివృద్ధికి కృషి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : దేవీ నవరాత్రుల సందర్భంగా నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్టపై గల అమ్మవారి విగ్రహానికి సోమవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మంగారి గుట్ట అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే లతీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుట్టపైకి ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించేందుకు కృషి చేస్తానని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతి రఘుపతి, బోనగిరి దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రావుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కోదాడ, వెలుగు : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో పలువురికి సోమవారం పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలుతున్నాయన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అర్హులందరికీ పింఛన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, కందుల చంద్రశేఖర్, కల్లూరి పద్మజ, కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చాకలి అయిలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రైతు వేదికలో గర్భిణులకు సాముహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల్లో పౌష్టికాహారం లోపం తలెత్తకుండా ప్రభుత్వం పోషకాహారాన్ని అందజేస్తోందన్నారు. నార్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దూదిమెట్ల స్రవంతి, నక్కలపల్లి సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈద మాధవి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, కనుకు అంజయ్య, పాశం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి,  జయలక్ష్మి, ఎంపీడీవో యాదగిరిగౌడ్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మురళి, సీడీపీవో అగా అస్ర అంజు, ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్లు సరిత, అంజమ్మ పాల్గొన్నారు.

సమైక్య పాలనలో ఎన్నో కష్టాలు పడ్డం

చండూరు (నాంపల్లి), వెలుగు : సమైక్యపాలనలో ఎన్నో కష్టాలు పడ్డామని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నాంపల్లిలో సోమవారం నిర్వహించిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచాక ఆరేళ్లలోనే ఫ్లోరోసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మునుగోడు ప్రజలు విముక్తి కలిగిందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు పెడతరాన్నారు. అంతకుముందు మహిళలు, కార్యకర్తలు బతుకమ్మలు, బోనాలతో సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, జడ్పీటీసీ ఏవీ.రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

పంచాయతీలకు బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేయండి

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని పంచాయతీలకు కొత్త బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు వినతిపత్రం అందజేశారు. కొన్ని పంచాయతీ బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిథిలావస్థకు చేరుకున్నాయని, మరికొన్ని గ్రామాలకు బిల్డింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేవని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మాటూరు నుంచి వర్టూరు వరకు బీటీ రోడ్డు, యాదగిరిగుట్ట పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పెద్ద కందుకూరు వరకు, తుర్కపల్లి నుంచి మామిళ్లగూడెం వరకు మర్యాల సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి చీకటిమామిడి వరకు రోడ్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. 

ఎల్లారెడ్డికి సన్మానం

యాదాద్రి, వెలుగు : ప్రధాని మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో భువనగిరిలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక వేత్త పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడారు. దేశ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారన్నారు. ఏలె చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, బూడిద భిక్షమయ్యగౌడ్, నందకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దాసరి మల్లేశం, సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.రెడ్డి, నర్ల నర్సింగరావు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండలో శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్​కృష్ణారెడ్డి, హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సూర్యాపేటలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్ కేశవ్, కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాజరై ఐలమ్మ ఫొటో, విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. యాదాద్రి జిల్లా చినకందుకూరులో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించారు.   

– వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అన్ని వార్డులకు సమానంగా నిధులివ్వాలి

కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ధర్నా

యాదాద్రి, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్ల వార్డులకు ఎక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ సోమవారం భువనగిరి మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సోమవారం స్థానికంగా నిర్వహించిన కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాయ దశరథ మాట్లాడుతూ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వని ప్రభుత్వం టీయూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐడీసీ నుంచి రూ. 16.50 కోట్ల అప్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ నిధులను కూడా అన్ని వార్డులకు సమానంగా ఇవ్వకుండా టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్ల వార్డులకు ఎక్కువగా తీసుకున్నారని ఆరోపించారు. ‘ఈ అప్పును మీ ఇంట్లోంచి కడ్తరా ?’ అని ప్రశ్నించారు. పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఎప్పుడు కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు చేయకపోవడంపై కౌన్సిలర్లు జనగాం  కవిత, లక్ష్మి, సుమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండా అంశాలు కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకముందే సమావేశం నుంచి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్లు వెళ్లిపోవడంపై నిరసన తెలిపారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోత్నక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించే టైంలో ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు.