రాష్ట్ర సంపద కేసీఆర్ కుటుంబానిది కాదు

రాష్ట్ర సంపద కేసీఆర్ కుటుంబానిది కాదు
  • ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మం: రాష్ట్ర సంపద ప్రజలకు చెందాలే గాని కేసీఆర్ కుటుంబానికి కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండలం యడవెల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మల్లు భట్టి విక్రమార్క దంపతులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు  పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు స్థానిక ప్రజలతో కలసి యాత్ర కొనసాగిస్తున్నారు భట్టి విక్రమార్క.

 ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. 32 రోజులపాటు పాదయాత్రను కొనసాగిస్తానని వివరించారు. తెలంగాణ తెచ్చుకుంది ప్రజల కోసం..కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. రాష్ట్ర సంపద మొత్తం ప్రజలకు చెందాలే తప్ప కేసీఆర్‌ కుటుంబానికి కాదని ఆయన పునరుద్ఘాటించారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

దొరల గడీలను బద్దలు కొట్టడానికి యువకిశోరాలు ముందుకు రావాలి

కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది

మేడారం జాతర హుండీ లెక్కింపు.. 5వ రోజు ఆదాయం ఎంతంటే