మరాఠా రిజర్వేషన్ రగడ.. మహారాష్ట్ర బంద్

మరాఠా రిజర్వేషన్ రగడ.. మహారాష్ట్ర బంద్

ముంబై: మహారాష్ట్రలో రిజర్వేషన్ రగడ మళ్లీ మొదలైంది. కోటా ‌కోసం డిమాండ్ చేస్తూ మరాఠా సంఘాలు శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌‌కు పిలుపునిచ్చాయి. చదువు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి చెందిన వారికి రిజర్వేషన్‌‌ను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కమ్యూనిటీకి రిజర్వేషన్ కల్పించే చట్టంపై సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో దాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వంపై మరాఠా సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. రిజర్వేషన్‌‌ బిల్లును అత్యున్నత ధర్మాసనం ముందు తిరిగి ప్రవేశ పెడతామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చినప్పటికీ మరాఠాలు తగ్గడం లేదు. 10 శాతం కోటా కల్పిస్తూ మరాఠాలను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కింద తీసుకురావాలని సర్కార్ యత్నిస్తున్నప్పటికీ పెద్దగా సత్ఫలితాలు రావడం లేదు. ఈడబ్ల్యూఎస్‌‌ను మరాఠా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.