చలికాలం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

చలికాలం.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

చలికాలం.. పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. చలి తీవ్రత పెరగడంతో మీ శారీరక, మానసక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక సవాళ్ళు ఎదురవుతాయి. అయితే వీటినుంచి రక్షించుకోవాలంటే.. పటిష్టమైన ప్రణాళికతో దినచర్యను రూపొందించుకొని సంవత్సరంలో మూడు నెలల పాటు ఉంటే ఈ మాయా కాలాన్ని మనం చక్కగా ఎంజాయ చేయొచ్చు. మనం చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడే కొన్ని ముఖ్యమైన చిట్కాలను తెలుసుకుందాం.. 

1. సమతులాహారం.. 

చలికాలంలో అంటే చక్కటి విందులకు మంచి సమయం.. వేడి వేడి వంటకాలను తింటూ ఎంజాయ్ చేసే కాలం..ఈ టైంలో రోగనిరోధక శక్తి తగ్గి సీజనల్, ఇతర వ్యాధుల సంక్రమించే అవకాశం ఉంటుంది. దీనికి డాక్టర్లను సంప్రదించాలి.. దీనికంటే ముందు ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు రోగనిరోధక వ్యవస్థకు మెరుగు పర్చే విటమిన్లు, ఖనిజాలను అందించే ఆహారాన్ని మీ భోజనంలో ఉంచుకోవాలి.. దీనికోసం పుష్కలంగా పండ్లు, కూరగాయలు, సిట్రస్ పండ్లు, బ్రోకలీ, చిలకడదుంప వంటి చలికాలంలో దొరికే వాటిని తినడం ద్వారా మీ ఆరోగ్యానికి సహజమైన ప్రోత్సాహం లభిస్తుంది. 

2. హైడ్రేటెడ్ గా ఉండడం 

చలి బాగా ఉన్నప్పుడు బాగా హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. చల్లని, పొడిగాలి శరీరంనుంచి నీటిని పీల్చేస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు నీరు, హర్బల్ టీలు, వెచ్చని సూప్ లు తీసుకోవాలి. కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. 

3.క్రమం తప్పకుండా వ్యాయామం 

సాధారణ రోజుల్లో మాదిరిగానే చలికాలంలో కూడా వ్యాయామం అనేది చాలా ముఖ్యం. శారీరక శ్రమ అనేది మీ శరీర ఆకృతిని మెయింటెన్ చేయడమే కాకుండా మానసిక స్థితిని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చలిలో ఔట్ డోర్ వర్కవుట్స్ సాధ్యం కాకపోతే.. యోగా, జిమ్ లో వ్యాయామం చేయాలి. ఒకవేళ బయట వ్యాయామం చేస్తే.. వెచ్చగా ఉంటే తగిన దుస్తులు ధరించి చేయాలి. 

4. రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోండి 

చలికాలం అంటేనే ప్లూ, జలుబు ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా వీటికి చెక్ పెట్టొచ్చు. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలంటే.. తగినంత నిద్ర పోవాలి. చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డాక్టర్లు సూచిస్తూ విటమిన్ సి, జింక్ సప్లిమెంట్ లు తీసుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో ప్రేగు కీలక పాత్ర పోషిస్తుంది.. కాబట్టి ఆహారంలో ప్రోబయోటిక్స్, ప్రీ బయోటిక్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.