లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు

ముంబయి: స్టాక్ మార్కెట్ దేశీయ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసి.. ఆసియా ఫసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్న తరుణంలో భారత స్టాక్ సూచీలు మాత్రం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 250కిపైగా పాయింట్ల లాభంతో 58,250 పాయింట్లతో మొదలుకాగా.. నిఫ్టీ కూడా 90 పాయింట్ల లాభంతో 17365 వద్ద ట్రేడింగ్ మొదలైంది. 
 ఒపెక్ దేశాల కూటమి నిన్న సమావేశమై వచ్చే నెలలో చమురు ఉత్పత్తిని 2 మిలియన్ బ్యారెళ్లు తగ్గించాలని నిర్ణయించడంతో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 93 డాలర్లకు పెరిగింది. అలాగే రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే రూ.81.61 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.