కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు షేక్ అవుతున్నాయి. వరుసగా మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగుస్తున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరవుతోంది. దలాల్ స్ట్రీట్ ఇవాళ దారుణమైన పరిస్థితిని చూసింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే నిఫ్టీ, సెన్సెక్స్ సూచికలు 10 శాతం పతనమయ్యాయి. లోయర్ సర్క్యూట్‌కు చేరడంతో సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 రూపాయల 43 పైసలకు పెరిగింది. సెన్సెక్స్ 29 వేల 687 పాయింట్ల దగ్గర నిలిచిపోగా, నిఫ్టీ 8 వేల 624 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ ఆపేశారు.

కరోనా ఎఫెక్ట్‌తో ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి సమయాల్లో సేఫ్‌గా భావించే బంగారం, బంగారం బాండ్ల షేర్లు వంటివి కూడా తగ్గిపోతున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు 7 శాతం పడిపోగా..జపాన్ నిక్కీ 10 శాతం పడిపోయింది. కొరియాలో స్టాక్ మార్కెట్లు బాగా పడిపోవడంతో అక్కడ కూడా కొంత సేపు ట్రేడింగ్ నిలిపేశారు. న్యూజీలాండ్‌లో కూడా సూచీలు కరోనా దెబ్బకు షేక్ అయ్యాయి.

For More News..

కెనడా ప్రధాని భార్యకు కరోనా వైరస్

సింధియాకు షాక్.. 6 ఏళ్ల క్రితం కేసు రీఓపేన్

పీసీసీ చీఫ్ నువ్వా.. నేనా..

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన