మహారాష్ట్రలో రిజర్వేషన్ల గొడవలు

మహారాష్ట్రలో రిజర్వేషన్ల గొడవలు

మహారాష్ట్రలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మరాఠా రిజర్వేషన్లు డిమాండ్​ చేస్తూ జల్నా జిల్లాలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది.  నిరసనకారులు రాళ్లు రువ్వడంతోపాటు పాలు వాహనాలు తగలబెట్టారు. పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను చెదరగొట్టారు. జల్నా జిల్లా తాజా హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. 

మంగళవారం (ఆగస్టు29) నుంచి సెంట్రల్​ మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మరాఠా రిజర్వేషన్లు డిమాండ్​ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం (సెప్టెంబర్1న)  నిరాహార దీక్షకు మద్దతుగా నిరసనకారులు ఆందోళన ఉద్రిక్తం చేయడంతో హింసాత్మకంగా పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో  పోలీసులతో సహా అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అంబాద్​ తహసీల్​పరిధిలోని అంతర్వాలి గ్రామంలో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్​, బాష్పవాయువు షెల్​ లను ప్రయోగించారు.