కన్నయ్య కుమార్ కాన్వాయ్ పై రాళ్ల దాడి

కన్నయ్య కుమార్ కాన్వాయ్ పై రాళ్ల దాడి

సీపీఐ నేత, విద్యార్థి నేత కన్నయ్య కుమార్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. బీహార్ లోని సుపౌల్ జిల్లాలో జరిగిన CAA వ్యతిరేక సదస్సులో పాల్గొన్నారు. సభ ముగిసిన తర్వాత వెళ్తున్న సమయంలో ఓ కూరగాయల మార్కెట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. దీంతో కొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల క్రితం కూడా కన్నయ్య కాన్వాయ్ పై దాడి జరిగింది.