
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఐదు కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. గురువారం (జూన్ 26) ప్రకటించిన ఈ రూల్స్ లో టెస్ట్ క్రికెట్ పై ఫోకస్ చేస్తూ రూల్స్ ప్రకటించింది. గత వారం కంకషన్ సబ్‌స్టిట్యూట్ లో గందరగోళాన్ని తొలగించగా.. వన్డే ఫార్మాట్ లో బ్యాట్, బంతికి మధ్య కాంటెస్ట్ రసవత్తరంగా మార్చాలని కొత్త బంతి పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్ట్ క్రికెట్ లో స్టాప్ క్లాక్ రూల్.. డీఆర్ఎస్ విధానంపై మార్పులు చేస్తూ కీలక రూల్స్ ప్రకటించింది. ఈ రూల్స్ మూడు ఫార్మాట్ లకు వర్తిస్తాయి. ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
టెస్ట్ క్రికెట్ లో స్టాప్ క్లాక్:
స్టాప్ క్లాక్ రూల్ ఇప్పటివరకు వన్డే, టీ20 ఫార్మాట్ లో మాత్రమే ఉంది. ఈ రూల్ ను ఐసీసీ టెస్టుల్లోనూ చేర్చింది. టెస్ట్ మ్యాచ్‌లలో స్లో ఓవర్ రేట్ల సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ స్టాప్ క్లాక్‌ను ప్రవేశపెట్టింది. ఈ రూల్ ప్రకారం ఫీల్డింగ్ చేస్తున్న జట్టు మునుపటి ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపు కొత్త ఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే అంపైర్లు వార్నింగ్ ఇస్తారు. రెండు సార్లు కంటే అంపైర్ ఎక్కువసారి వార్నింగ్ ఇచ్చినట్లయితే బ్యాటింగ్ చేసే జట్టుకు 5 పరుగుల పెనాల్టీ ఇస్తారు. ప్రతి 80 ఓవర్లకు గడియారం రీసెట్ అవుతుంది. ఈ మార్పు ఇప్పటికే ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) సైకిల్‌లో ఉపయోగిస్తున్నారు.
లాలాజల నియమం సడలించబడింది:
బంతిపై లాలాజలం వాడకంపై నిషేధం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఫీల్డింఫ్ చేస్తున్న జట్టు బంతి స్వరూపాన్ని మార్చి కొత్త బంతిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇకపై అలా జరగడానికి వీలు లేదు. అంపైర్లు బంతిని స్థితిని గమనించి.. బంతి పరిస్థితి గణనీయంగా మారిందని అంపైర్లు నిర్ధారించినట్లయితే బంతిని మారుస్తారు. లాలాజలాన్ని బలవంతంగా బంతిపై రుద్దడానికి వీలు లేదు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా అలా చేస్తే బ్యాటింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.
DRS విధానంలో కొత్త మార్పు:
ఈ రూల్ ప్రకారం (ఉదాహరణకు) ఫీల్డింగ్ చేస్తున్న జట్టు క్యాచ్ కోసం అప్పీల్ చేస్తుంది. ఈ సమయంలో అంపైర్ ఔటిస్తే బ్యాటింగ్ చేసే జట్టు క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూ కోరుతుంది. ఈ సమయంలో థర్డ్ అంపైర్ మొదట అల్ట్రాఎడ్జ్ చెక్ చేస్తారు. ఒకవేళ బంతి బ్యాట్ కు తగలేకపోతే ఎల్బీడబ్ల్యూ కోసం అంపైర్ చెక్ చేస్తారు. ఎల్బీడబ్ల్యూలో ఔట్ అని తేలినా లేకపోతే అంపైర్స్ కాల్ వచ్చినా ఔట్ గానే పరిగణిస్తారు.
నో బాల్ లో క్లీన్ క్యాచ్ పడితే పరుగులు ఉండవు:
సవరించిన రూల్ ప్రకారం నో బాల్ వేసినప్పుడు క్యాచ్ పడితే దాన్ని నాటౌట్ గా పరిగణిస్తారని మనకు తెలిసిందే. అయితే క్యాచ్ పట్టినప్పుడు అది క్లీన్ క్యాఛా.. కాదా అని పరీశీలిస్తారు. ఒకవేళ క్లీన్ క్యాచ్ అయితే అప్పటివరకు తిరిగిన పరుగులు బ్యాటింగ్ జట్టుకు జత చేయరు. కేవలం నో-బాల్ పరుగు మాత్రమే బ్యాటింగ్ జట్టు స్కోరుకు జోడించబడుతుంది. ఒకవేళ క్లీన్ క్యాచ్ కాకపోతే బ్యాటర్లు పూర్తి చేసిన పరుగులను జట్టు స్కోర్ లో జత చేస్తారు. అంతేకాదు క్యాచ్ సరిగా పట్టకుండా ఔట్ అని అప్పీల్ చేస్తే.. థర్డ్ అంపైర్ చెక్ చేశాక అది క్లీన్ క్యాచ్ కాదని నాటౌట్ గా తెలితే నో బాల్ గా ప్రకటిస్తారు.
షార్ట్ రన్ తీస్తే భారీ మూల్యం:
బ్యాటర్లు పరుగు పూర్తి చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో బ్యాట్ ను పూర్తిగా క్రీజ్ లో పెట్టరు. దీనినే షార్ట్ రన్ అంటారు. గతంలో ఇలా చేస్తే అంపైర్లు చెక్ చేసి ఆ రన్ ఉండదని అంపైర్లు బ్యాటర్లకు వార్నింగ్ ఇస్తారు. అయితే కొత్తగా సవరించిన రూల్స్ ప్రకారం బ్యాటర్ పరుగు పూర్తి చేసి ఇంకో పరుగు తీసే క్రమంలో క్రీజ్ లో బ్యాట్ పూర్తిగా పెట్టరో ఆ జట్టుకు 5 రన్స్ పెనాల్టీ విధించబడుతుంది. అంతేకాదు ఫీల్డింగ్ జట్టు తర్వాత బంతికి ఎవరు స్ట్రైక్ తీసుకోవాలో ఎంచుకోవచ్చు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
— Sportskeeda (@Sportskeeda) June 26, 2025
🔹 The ICC has introduced a stop clock to control over rates in Tests.
🔸 No mandatory ball change for the deliberate use of saliva.
🔹 New protocols introduced in the DRS review system for out decisions.
🔸 If a catch is unclear and the fielders… pic.twitter.com/DLzG8EjZVd