17న దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

17న దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

ఈ నెల 17న దేశవ్యాప్తంగా సమ్మె చేసేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. డాక్టర్ల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) పిలుపునిచ్చింది. కోల్ కతాలో జూనియర్ డాక్టర్లపై దాడులకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్టు IMA ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 10న ఓ జూనియర్‌ డాక్టర్( జూడా)పై దాడి జరిగింది. ఈ సంఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు.

జూడా డిమాండ్లను సీఎం మమతా బెనర్జీ పట్టించుకోకపోగా, అల్టిమేటం జారీ చేశారు. విధులకు హాజరుకాక పోతే హాస్టళ్ల నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దాంతో జూడాలు మరింత రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను కొనసాగించారు. అంతేకాకుండా, విధులకు హాజరైన కొందరు జూడాలు హెల్మెట్లు ధరించి ట్రీట్ మెంట్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈనెల 17న ఔట్‌పేషెంట్‌ విభాగాలతో పాటు  అత్యవసర మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు IMA ప్రకటించింది. అయితే ఎమర్జెన్సీ, ​క్యాజువాలిటీ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.