స్ట్రింగ్ మెటావర్స్ లాభం రూ.18.29 కోట్లు

స్ట్రింగ్ మెటావర్స్ లాభం రూ.18.29 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బ్లాక్‌‌‌‌చెయిన్ సొల్యూషన్స్​అందించే స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ తన 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్వార్టర్లో  కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.199 కోట్లుగా నమోదైంది.  పన్ను తర్వాతి లాభం (పీఏటీ) రూ.18.29 కోట్లుగా ఉంది. 

పీఏటీ మార్జిన్​ 9.19 శాతం కాగా, ఆపరేటింగ్​ఇబిటా 21.83 శాతం కోట్లు ఉందని కంపెనీ తెలిపింది. ఈ ఫలితాలు కంపెనీ ఆర్థిక పనితీరులో స్థిరత్వాన్ని  వృద్ధిని సూచిస్తున్నాయని, పెట్టుబడిదారులలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని పేర్కొంది.