నీట్‌ ఎగ్జామ్‌ భయంతో స్టూడెంట్‌ ఆత్మహత్య

నీట్‌ ఎగ్జామ్‌ భయంతో స్టూడెంట్‌ ఆత్మహత్య
  • చదవలేకపోతున్నానంటూ వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌
  • బిల్డింగ్​పై నుంచి దూకి ఆత్మహత్య 

జీడిమెట్ల, వెలుగు : నీట్‌ ఎగ్జామ్‌ అంటే భయంతో ఓ స్టూడెంట్‌ బిల్డింగ్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుచిత్ర, స్ప్రింగ్​ ఫీల్డ్​ కాలనీ, చంద్రోదయ రెసిడెన్సీలో ఉంటున్న అరవింద్‌ జైస్వాల్‌ టైలర్​. ఇతడి కొడుకు పీయూశ్‌ జైస్వాల్‌ (22) ‘నీట్‌’ కోసం లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు తండ్రితో కలిసి పడుకున్నాడు. 

తర్వాత ‘నేను చదవలేకపోతున్నా, సూసైడ్‌ చేసుకుంటున్నా’ అని తాను కోచింగ్‌ తీసు కుంటున్న ఇన్‌స్టి  ట్యూట్‌ గ్రూప్‌లో మెసేజ్‌ పెట్టాడు. ఇది చూసిన ఫ్రెండ్స్‌ అర్ధరాత్రి 1.35 గంటలకు జైస్వాల్‌ తల్లికి ఫోన్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులిద్దరూ  ఇంట్లో చూడగా జైస్వాల్‌ కనిపించలేదు. ఐదో అంతస్థు బాల్కనీ నుంచి చూడగా కింద పడి ఉన్నాడు. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయాడు.