స్కూల్లో టీచర్లు కావాలని స్టూడెంట్ల నిరసన

స్కూల్లో టీచర్లు కావాలని స్టూడెంట్ల నిరసన

వెలుగు, షాద్ నగర్ : సరిపడా టీచర్లు లేక మంచిగా చదువుకోలేకపోతున్నామని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్ ​మండలం ఏలికట్ట, చౌదర్​గూడ మండలం పెద్దఎల్కిచర్ల ప్రభుత్వ ​ప్రైమరీ స్కూళ్లలోని స్టూడెంట్లు శుక్రవారం నిరసనకు దిగారు. ఎలికట్టలో 180 మంది స్టూడెంట్లకు ఆరుగురు టీచర్లు, పెద్దఎల్కిచర్లలో 200కి గాను ఆరుగురు టీచర్లు ఉన్నారు.

రెండు చోట్ల ఇద్దరు, ఇద్దరు టీచర్లు డిప్యుటేషన్​పై జిల్లాలోని ఇతర స్కూళ్లకు వెళ్తున్నారు. టీచర్లు లేక క్లాసులు సరిగా జరగడం లేదని స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మౌలిక వసతులతోపాటు టీచర్లను నియమించాలని కోరుతున్నారు.