
- సీడ్స్ షాపుల్లో తనిఖీలు
- పత్తి సీడ్స్ పై ప్రత్యేక దృష్టి
- గతంలో పలుచోట్ల పట్టుబడిన నకిలీ విత్తనాలు
- అయినా ఆగని దందా
యాదాద్రి, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలు, హెచ్‌టీ కాటన్(బీటీ-3)సీడ్స్ పై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్దృష్టి సారించింది. వీటిని కట్టడి చేయడానికి పోలీసులు, అగ్రికల్చర్ఆఫీసర్లతో కూడిన టాస్క్ఫోర్స్టీమ్స్ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ సీడ్స్ షాపులతోపాటు విడి సీడ్స్అమ్మే ఇతరులపై నిఘా పెట్టనుంది. గతంలో పలు కేసులు నమోదు అయినప్పటికీ ప్రతి సీజన్లో నకిలీ సీడ్స్‌తోపాటు హెచ్‌టీ సీడ్స్ సేల్స్ సాగుతూనే ఉంది.
1.15 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు..
కమర్షియల్ క్రాప్ అయిన పత్తి యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున సాగు అవుతోంది. 2019 నుంచి లక్ష ఎకరాలకు తగ్గకుండా రైతులు సాగు చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వం సూచనతో 2020లో 1.59 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. మార్కెట్‌కు పత్తి వచ్చే సమయానికి దళారులు ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి 1.15 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తారని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు.
మార్కెట్లోకి లూజ్ సీడ్స్..
ప్రతి వానాకాలం సీజన్ మాదిరిగానే ఈసారి కూడా మార్కెట్లోకి లూజ్పత్తి సీడ్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రకాల విత్తనాలు రంగురంగుల ప్యాకెట్లలో సేల్స్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విత్తనాలు ఎక్కువగా ఏపీ నుంచి ఎల్బీనగర్కు చేరుకొని అక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలకు సరఫరా చేసి విక్రయాలు చేయిస్తున్నట్టుగా
సమాచారం.
నిషేధమున్నా.. హెచ్‌టీ సీడ్స్..
పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన హెచ్‌టీ (బీటీ-3) సీడ్స్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ సీడ్స్ వల్ల భూసారం దెబ్బతింటుందని, అందుకే ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ సీడ్స్వల్ల పత్తికి సవాల్‌గా మారిన కలుపు సమస్య పరిష్కారం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. కలుపు మందు చల్లినా ఈ రకం సీడ్స్‌తో పెరిగే పత్తి మొక్కలకు నష్టం వాటిల్లదు. దీంతో రైతులు కూడా ఈ రకం సీడ్స్‌పై దృష్టి సారిస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ టీమ్స్..
నకిలీ సీడ్స్‌తోపాటు హెచ్‌టీ రకం సీడ్స్‌ను కట్టడి చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూడు టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్‌లో ఏడీఏతోపాటు పోలీసు, ఏఈవోలు మెంబర్స్‌గా ఉంటారు. ఈ టీమ్స్ విడివిడిగా మండలాల్లో పర్యటిస్తూ నకిలీ సీడ్స్ సేల్స్‌పై నిఘా వేయనుంది. ఎక్కడైనా నకిలీ సీడ్స్అమ్మితే కేసులు నమోదు చేస్తారు. జిల్లాలో సీడ్స్ అమ్మే 230 షాపుల్లోనూ తనిఖీలు
నిర్వహించనున్నారు.
కేసులు నమోదు అవుతున్నా ఆగని దందా..
హెచ్ టీ (బీటీ–-3), లూజ్సీడ్స్ అమ్ముతున్న వారిపై గతంలో కేసులు నమోదు చేసినా ఈ దందా ఆగడం లేదు. గతంలో చౌటుప్పల్మీదుగా రవాణా అవుతున్న 44 బ్యాగుల్లోని రూ.70 లక్షల విలువైన 22 క్వింటాళ్ల హెచ్‌టీ విత్తనాలను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఏపీ, మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మోటకొండూరు, ఆలేరు మండలాల్లో విడి విత్తనాలతోపాటు హెచ్‌టీ విత్తనాలను సేల్స్చేస్తున్న వారిని పట్టుకొని సీడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ ప్రతీ సీజన్లో ఈ దందా సాగుతూనే ఉంది.