స్కాలర్ షిప్ ఇవ్వండి.. విద్యార్థుల ఆందోళన

స్కాలర్ షిప్ ఇవ్వండి.. విద్యార్థుల ఆందోళన

పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లు వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేశారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

కేంద్ర ప్రభుత్వం 10 శాతం.. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఈ బడ్జెట్లో విద్యా రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ & కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలన్నారు.  గత 3సంవత్సరాల నుండి స్కాలర్ షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని..లేకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.