ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి : కె.వసుంధర దేవి

ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి : కె.వసుంధర దేవి

తొర్రూరు, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత విద్యతోపాటు పుస్తకాలు, ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ అకడమిక్స్ కె.వసుంధర దేవి కోరారు. తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆమె సందర్శించి, నిర్వహణ తీరు, వివిధ అంశాలపై పర్యవేక్షించారు. 

.అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. కళాశాల లొకేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లలో ప్రచారం చేసి ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా చొరవ తీసుకోవాలని, అడ్మిషన్ల సంఖ్యను పెంచాలని కాలేజ్​ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి.అరుణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ నారాయణ, అధ్యాపకులు  తదితరులు పాల్గొన్నారు.