సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు

సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు

జనవరి 23. 1897లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు. ఆగష్టు 18, 1945న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్టు వార్తా కథనాలు ప్రచురించబడ్డాయి. అయిత కేంద్రం 2017లో ఆర్టీఐలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 1966 తర్వాత చాలా మంది సినీ నిర్మాతలు సుభాష్ చంద్రబోస్ పై సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించారు. దీనికి కారణం అతని వీరోచిత పోరాటం, శౌర్యం, అతని మరణం వెనకాల దాగిన రహస్యమే. అయితే బోస్ 126వ జయంతి సందర్భంగా ఆయన జీవితంపై చిత్రీకరించిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం...

సమాధి- 1950

ఈ చిత్రం నేరుగా సుభాస్ జీవితం చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో అతను ఐఎన్ఏ సైనికుడుగా కనిపిస్తాడు. దేశం కోసం తన సోదరి ప్రేమను వదులుకోవడానికి కూడా సిద్ధపడతాడు. రమేష్ సైగల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలు, రాజకీయ అభిప్రాయాలను చిత్రీకరిస్తుంది.

సుభాష్ చంద్ర - 1966

పీయూష్ బోస్ రూపొందించిన ఈ బెంగాలీ చలనచిత్రం బోస్ విశ్వాసాలు ఎలా పరిణామం చెందాయి.. అతను భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి భీకర రాజకీయ కార్యకర్తగా ఎలా పరిణామం చెందాడు అనే దాని గురించి ఈ సినిమాలో క్లుప్తంగా ప్రదర్శించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో-2004

ఈ చిత్రంలో బోస్ గృహనిర్బంధం నుండి తప్పించుకోవడం, భారతదేశం నుండి నిష్క్రమించడం, ఐఎన్ఏ స్థాపనపై చక్కగా చూపించారు. బ్రిటీష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ చేసిన ప్రచారం ఈ చిత్రంలో చూపబడింది. ప్రముఖ చిత్ర నిర్మాత శ్యామ్ బెనగల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌లో నేతాజీగా సచిన్ ఖేడేకర్ నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రలను జిషు సేన్‌గుప్తా (సిసిర్ బోస్‌గా), కులభూషణ్ ఖర్బండా (ఉత్తమ్‌చంద్ మల్హోత్రాగా) పోషించారు.

అమీ సుభాష్ బోల్చి- 2011

ఈ చిత్రం సామాజిక సమస్యలను, వాటన్నింటిని నిర్మూలించడానికి ఒక వ్యక్తి చేసే పోరాటాన్ని నొక్కి చెబుతుంది. సుభాష్ చంద్రబోస్ ఒక బెంగాలీ సామాన్యుడిగా కీలక పాత్ర పోషించారు. దేబబ్రత బోస్ (మిథున్ చక్రవర్తి) తన మాతృభాష, మాతృభూమి కోసం పోరాడే తీరు అందరికీ నచ్చుతుంది. దేబబ్రత స్వంత మనస్సాక్షి ద్వారా సుభాస్ తన మాతృభూమి కోసం పోరాడాలనే సంకల్పాన్ని పునరుజ్జీవింపజేస్తాడు. ఈ బెంగాలీ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. 

రాగ్ దేశ్- 2017

ఈ చిత్రంలో నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, బర్మా నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. 1945లో ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన విచారణల శ్రేణిని కూడా ఇందులో ప్రదర్శించారు. ఇక్కడే ఐఎన్ఏ సైనికులను తిరుగుబాటుదారులు, జపనీస్ తొత్తులు అని బ్రిటిష్ అధికారులు ఆరోపించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి దారితీసిన నాటకీయ పరిణామాలు, చారిత్రాత్మక సంఘటనలు ఈ చిత్రంలో చూపబడ్డాయి. కాగా దీనికి ధులియా దర్శకత్వం వహించారు.

బోస్: డెడ్/అలైవ్ - 2017

తొమ్మిది ఎపిసోడ్స్ లో టెలివిజన్ ధారావాహికలో ఇది ప్రదర్శించబడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య మరణ పరిస్థితులకు సంబంధించిన సిద్ధాంతాలను కూడా ఇందులో చూపించారు. రచయిత ఔజ్ ధర్ 2012లో రాసిన ఇండియాస్ బిగ్గెస్ట్ కవర్-అప్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ ధారావాహికలో ఆగస్ట్ 18, 1945న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించలేదన్నట్టుగా చూపించారు. ఏక్తా కపూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో రాజ్‌కుమార్ రావు (సుభాస్ చంద్రబోస్ పాత్రలో) నటించారు.

గుమ్నామీ - 2019

ఈ చిత్రం 1999 నుండి 2005 వరకు జరిగిన ముఖర్జీ కమిషన్ విచారణల ఆధారంగా రూపొందించబడింది. ఈ సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన మూడు సిద్ధాంతాలు అన్వేషించబడ్డాయి. ప్రభుత్వ న్యాయవాదికి. గుమ్నామి బాబా-సపోర్టింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మధ్య సాగే విచారణల నాటకీయతను చక్కగా ప్రదర్శించారు. వారి మధ్య జరిగే సంఘర్షణ సమయంలో డెత్ ఇన్ రష్యా అనే అంశం కూడా వస్తుంది. ఈ మూవీకి 2019లో బెంగాలీలో బెల్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది.

ది ఫర్గాటెన్ ఆర్మీ - 2020

1999 ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రంలో ఆరు ఎపిసోడ్ లతో కూడిన డాక్యుమెంటరీగా రిలీజ్ అయింది. బోస్ స-ృష్టించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, సైనికుల గురించి తెలియని వాస్తవాలు, వారి పోరాటాలను చూపించే ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది.