ఈ చిత్రంతో నా కెరీర్ టర్న్ అవుతుంది : సుభాష్ ఆనంద్

ఈ చిత్రంతో నా కెరీర్ టర్న్ అవుతుంది : సుభాష్ ఆనంద్

సినిమా విజయంలో పాటల పాత్ర కూడా ఉంటుందన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌‌లో  తెరకెక్కించిన ‘అలా నిన్ను చేరి’  చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించారు. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ ‘కర్ణాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నా.

ఇదివరకు చాలా సినిమాలు చేశా.. కానీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ చిత్రంతో నా కెరీర్ టర్న్ అవుతుందని ఆశిస్తున్నా.  చంద్రబోస్ లాంటి లెజెండరీ వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులోని అన్ని పాటలకు ఆయనే లిరిక్స్ రాశారు.  ఇదొక ఫీల్ గుడ్ లవ్‌‌స్టోరీ. సాహిత్య విలువలతో మంచి పాటలను అందించాం. నవరసాలను చూపించేలా పాటలుంటాయి. జావెద్ అలీ, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహెరా, సింహ, ఇంద్రావతి చౌహాన్ వంటి వారు పాటలను అద్భుతంగా పాడారు’ అని చెప్పాడు.