టికెట్​ ఇవ్వలేదని కర్నూలు జిల్లా టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

టికెట్​ ఇవ్వలేదని కర్నూలు జిల్లా టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు తారా స్థాయికి చేరుకున్నాయి.  టీడీపీ అధినేత చంద్రబాబు  కొన్ని స్థానాలకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు.  కోడెమూరు టీడీపీ నేత ఆకెపోగు ప్రభాకర్​ కు టికెట్​ ఇవ్వలేదు. ఎంతో కాలంగా టీడీపీ సేవ చేసినా... చంద్రబాబు తనను గుర్తించలేదని మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు.   ప్రస్తుతం ప్రభాకర్​ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబును నిందిస్తూ ప్రభాకర్​ భార్య కంట తడి పెట్టారు.

ALSO READ :- గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో 10 మందిపై కేసు

టీడీపీ తరపున కొన్ని అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేస్తూ మొదటి జాబితా విడుదల చేసిన వెంటనే అసంతృప్తి నేతలు బయటకు వస్తున్నారు.  కొంతమంది బహిరంగానే విమర్శించగా.. మరికొందరు తాడో పేడో తేల్చుకోవడానికి చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారు.  చాలా కాలం నుంచి పార్టీకి సేవ చేసిన వారికి కూడా టికెట్​ ఇవ్వలేదంటూ వాపోతున్నారు.  సీనియర్​ నేతలను.... మాజీ మంత్రులకు కూడా టికెట్​ కేటాయించలేదు.  దీంతో కర్నూలు జిల్లాలో  కోడుమూరు టీడీపీ నేత ప్రభాకర్​ కు టికెట్​ ఇవ్వకపోవడంతో ఆత్మహత్యా యత్నం చేయడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిం