అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లిస్తాం : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి

కొత్తపల్లి, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్​రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి బుడిగ జంగాల కాలనీలో పలువురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా గురువారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సొంత స్థలం ఉన్న చివరి లబ్ధిదారుడి వరకు ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

 భూమిపూజ చేసుకున్న లబ్ధిదారులు తూర్పాల పోచవ్వ, పర్వతం స్వప్న, కళ్లెం అంజవ్వ, చింతల లక్ష్మికి స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు అస్తపురం రమేశ్‌‌‌‌‌‌‌‌, పర్వతం మల్లేశం, అస్తపురం తిరుమల, శ్రీనివాస్, దుబ్బుల రాజయ్య, లచ్చయ్య పాల్గొన్నారు.

 ఓటు చోరీపై సంతకాల సేకరణ 

 ఓటు చోరీపై బల్దియా పరిధిలోని మల్కాపూర్​16వ, రేకుర్తి 20వ డివిజన్​ ఇందిరమ్మ కాలనీలో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న ఓటు చోరీని అరికట్టడానికి రాహుల్​గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో సంతకాల సేకరణ చేపట్టామని, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో డివిజన్​ నాయకుడు బొమ్మ ఈశ్వర్​గౌడ్, డివిజన్ అధ్యక్షుడు శంకర్, లీడర్లు మోహన్, శ్రవణ్​నాయక్, పండుగ సాయి, సందీప్, పోచమల్లు, సత్యనారాయణ, శ్రీనివాస్, ఎల్లాగౌడ్, మహేశ్​, లత, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.