ఈ నెల 16న కె 3.. కోటికొక్కడు రిలీజ్

ఈ నెల 16న కె 3.. కోటికొక్కడు రిలీజ్

కొద్ది రోజుల క్రితం ‘విక్రాంత్ రోణ’తో వచ్చిన సుదీప్.. ఈ నెల 16న ‘కె 3.. కోటికొక్కడు’ చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమాని శ్రేయాస్‌‌‌‌ మీడియా శ్రీనివాస్‌‌‌‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘పోయినేడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో విడుదలైన ఈ సినిమా కన్నడలో సక్సెస్ సాధించింది. సుదీప్ కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హయ్యెస్ట్‌‌‌‌ ఓపెనింగ్స్ రాబట్టింది. శ్రద్ధాదాస్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్. ఆషికా రంగనాథ్ స్పెషల్ సాంగ్ చేసింది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర సుదీప్‌‌‌‌ది. యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. డెబ్భైశాతం విదేశాల్లోనే తీశారు. డబ్బింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకముంది. సుదీప్  స్వయంగా కాల్ చేసి తెలుగు ప్రమోషన్స్‌‌‌‌కి టైమ్ కేటాయిస్తానని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో, రొమాన్స్, రోజులు మారాయి, వెంకటాపురం, క్రేజీ అంకుల్స్‌‌‌‌ చిత్రాలు నిర్మించాం. విల్లా, భద్రం, కళావతి అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేశాం. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి ‘గోదారి కథలు’ పేరుతో ఐదు కథల ఆంథాలజీ స్టార్ట్ చేస్తున్నాం. ‘రోజులు మారాయి’ ఫేమ్ మురళి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వయసుల వారినీ ఆకట్టుకునే కంటెంట్‌‌‌‌తో శ్రేయాస్ ఈటీ యాప్‌‌‌‌ను అక్టోబర్‌‌‌‌‌‌‌‌ నుంచి రీలాంచ్ చేయబోతున్నాం’ అని చెప్పారు.