గుండెపోటు బాధితులకు డిఫిబ్రిలేటర్ సంజీవని : సుధాకర్ లాల్

గుండెపోటు బాధితులకు డిఫిబ్రిలేటర్ సంజీవని :  సుధాకర్ లాల్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డిఫిబ్రిలేటర్ తో గుండెపోటు బాధితుల ప్రాణాలు కాపాడవచ్చని డీఎంహెచ్​వో సుధాకర్ లాల్  తెలిపారు. మంగళవారం డీఎంహెచ్​వో ఆఫీస్ లో పీహెచ్​సీ డాక్టర్లతో మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటుతో అనేక మంది చనిపోతున్నారని చెప్పారు. గుండెపోటు మరణాలను అరికట్టేందుకు డాక్టర్లు సిద్ధంగా ఉండాలని కోరారు. 

సీపీఆర్ చేయడం, ఆటోమేటెడ్  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్, డిఫిబ్రిలేటర్  పరికరాలను జిల్లాలోని అన్ని పీహెచ్​సీల్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించడంపై డాక్టర్లకు ట్రైనింగ్​ ఇస్తున్నట్లు తెలిపారు. ట్రైనర్  హేమప్రసాద్  ఆటోమేటెడ్  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్, డిఫిబ్రిలేటర్ పై అవగాహన కల్పించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు  డా.రవి నాయక్, డా.కృష్ణ మోహన్, డా.ప్రదీప్, రేనయ్య, విజయకుమార్, ప్రవీణ్  పాల్గొన్నారు.