
కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారిన సుహాస్(Suhas).. వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన రైటర్ పద్మభూషణ్(Writer Padmabhushan) తో డీసెంట్ హిట్ అందుకున్న ఆయన ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్(Ambajipeta Marriage Band) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కొత్త దర్శకుడు దుశ్యంత్ కటికినేని(Dishyanth Katikineni) తెరకెక్కించిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా రూ.6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక ఈ సినిమా తరువాత ప్రసన్నవదనం పేరుతో మరో సినిమాను మొదలుపెట్టేశాడు సుహాస్. కొత్త దర్శకుడు అర్జున్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మొహాలు కనిపించకపోవడం అనే పేస్ బ్లైండ్ వ్యాధి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ లో మీడియాతో ముచ్చటించిన సుహాస్ తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ALSO READ :- Vikramarkudu 2: రవితేజ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ సిద్ధం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
మీడియా మీట్ లో భాగంగా ఓ రిపోర్టర్ సుహాస్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య మీ రెమ్యురేషన్ బాగా పెంచారట నిజమేనా అని అడిగాడు. దానికి సమాధానంగా సుహాస్ మాట్లాడుతూ.. అవును.. ఏ నేను బతకకూడదా అంటూ మొహం మీదే చెప్పేశాడు. ఇక మరొకరేమో 3000 నుండి మూడు కోట్లకు ఎదిగారట నిజమేనా అని అడుగగా.. 1000 నుండి మూడు కోట్లు అనుకోండి అని అన్నాడు సుహాస్. దీంతో సుహాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా సుహాస్ మూడు కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారా, లేక రిపోర్టర్స్ అడిగారని అలా చెప్పాడా అనేది తెలియాల్సి ఉంది.