జోగు రామన్న అబద్దపు ప్రచారాలు మానుకోవాలి: ​సుహాసినీరెడ్డి

జోగు రామన్న అబద్దపు ప్రచారాలు మానుకోవాలి: ​సుహాసినీరెడ్డి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు :  ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న  అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జడ్పీ మాజీ చైర్​ పర్సన్ సుహాసినీ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కోర్టా చనాక ద్వారా ఒక్క ఎకరానికైనా సాగునీరు అందిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, జోగు రామన్న ఇవ్వలేదని నిరూపిస్తే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రూ.120 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర వాటాగా రూ.30 కోట్లు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. 

ALSO READ: ఎస్టీపీపీ లో మరో 800 మెగా వాట్ థర్మల్ పవర్ ప్లాంట్: సత్యనారాయణ రావు

2018లో పూర్తి అవ్వాల్సిన ఆసుపత్రిని ఆలస్యంగా ప్రారంభించి ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తేలేదని ఫైర్​అయ్యారు. ఇకనైనా ఎమ్మెల్యే  హితవు పలికారు. ఎమ్మెల్యే చెప్తున్న అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమిమైందని, ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. సమావేశంలో నాయకులు నారాయణ రెడ్డి, కొత్తపెల్లి సంతోష్, సతీశ్ రెడ్డి, తాటి సతీశ్, వెంకట్ రెడ్డి, భాగ్యలక్ష్మి, అశాంత్, కాంత, సరిత తదితరులు పాల్గొన్నారు.