
మాండ్య ఎంపీ సుమలత, ఆమె కుమారుడు అభిషేక్ అంబరీష్ కలసి ఏప్రిల్ 5 బుధవారం రోజున ప్రధాని మోడీని కలిశారు. త్వరలో అభిషేక్ వివాహం జరగనున్న నేపథ్యంలో మోడీని వివాహ ఆహ్వాన పత్రికతో అందజేశారు. తొలి ఆహ్వాన పత్రికను మోడీకే అందించడం విశేషం. "ప్రపంచంలో నేను చూసిన అద్భుతమైన నాయకుడు మోడీ... ఆయనను ఆహ్వానించిన క్షణం చాలా సంతోషంగా ఉంది" అంటూసుమలత తన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మండ్య నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై మోడీతో ఆమె చర్చించినట్లుగా తెలుస్తోంది.
మాండ్య లోక్ సభకు ఇండిపెండెట్ గా గెలిచిన సుమలత ఇటీవల బీజేపీకి మద్దుతు ఇచ్చారు. తాను బతికున్నంత వరకు తన కుమారుడు అభిషేక్ రాజకీయాల్లోకి రాడని హామీ ఇచ్చారు. కుటుంబ రాజకీయాలకు తాను వ్యతిరేకమని సుమలత ప్రకటించారు. కాగా అభిషేక్ అంబరీష్ , అవివా బిడ్డప్ప కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట వివాహం జూన్ మొదటి వారంలో జరగనుందని తెలుస్తోంది. ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు ఎంపీలు, మంత్రులకు సుమలత ఆహ్వానాలు అందజేయనున్నారు.