OTT Movie: ఓటీటీలో సత్తా చాటుతున్న తెలుగు సినిమా.. పాజిటివ్ రివ్యూలతో రికార్డ్ వ్యూస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie: ఓటీటీలో సత్తా చాటుతున్న తెలుగు సినిమా.. పాజిటివ్ రివ్యూలతో రికార్డ్ వ్యూస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సుమంత్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అనగనగా (Anaganaga). ఈ మూవీని థియేటర్లోకి తీసుకురాకుండా నేరుగా ఓటీటీలోకి వదిలారు. ఈ నెల మే15 నుంచి ‘ఈటీవీ విన్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది.

థియేటర్లో విడుదల అయితే కమర్షియల్గా ఏ మాత్రం సక్సెస్ అయ్యేదో గానీ ఓటీటీలో మాత్రం చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రశంసలను దక్కించుకుంటోంది. ఇంటిల్లి పాది హాయిగా చూసుకునేలా ఉందంటూ టాక్ వచ్చేసింది. దీంతో అందరూ ఈ మూవీ చూసేందుకు ఇష్టపడుతున్నారు.

అనగనగా ఓటీటీ:

అనగనగా మూవీ వంద మిలియన్ ప్లే సీమింగ్ మినిట్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. రిలీజైన 5 రోజుల్లోపే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాకుండా IMDBలో 8.3 రేటింగ్ సంపాదించుకుంది. 

“100 మిలియన్ల ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్. 100 మిలియన్ల ప్లస్ ఎమోషనల్ కన్నీళ్లు. మీ ప్రేమ అనగనగాను కేవలం ఒక సినిమా కాదు ఓ హృదయపూర్వక ప్రయాణంగా మలిచింది. చూసినందుకు, ఫీలైనందుకు, మాతో ప్రతి క్షణాన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్యూ” అనే క్యాప్షన్తో మేకర్స్ మరింత ఆసక్తి రేపారు. 

సమాజంలో విద్య బోధనపై నిరసనలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యావ్యవస్థలోని లోపాలు, విద్యా బోధనలో ఉండే వైపరీత్యాలపై సున్నితంగా సెటైర్లతో ఈ సినిమా తెరకెక్కింది. ముఖ్యంగా హీరో సుమంత్ యాక్టింగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ప్రతి రోజూ ఓ మైలురాయిని అందుకుంటూ దూసుకెళ్తోన్న ఈ మూవీపై రోజురోజుకు బజ్ పెరుగుతోంది.

ALSO READ | Mayabazar Re Release: మళ్లీ వెండితెరపై 68 ఏళ్ల నాటి క్లాసిక్ మాయాబజార్.. కలర్ వెర్షన్లో.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

చాలా కాలంగా పెద్ద హిట్ కొట్టని సుమంత్.. ఈసారి నేరుగా ఓటీటీలోకి వచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు. స్కూల్ మాస్టారుగా సుమంత్ రచించిన ప్రణాళికలతో తన ఫ్యాన్స్ చేత 100 మార్కులు వేసుకునేలా చేసుకున్నాడు. ఈ సినిమాను సన్నీ సంజయ్ డైరెక్ట్ చేయగా.. సుమంత్, కాజల్ చౌదరి లీడ్ రోల్స్లో నటించారు. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‌‌‌‌తో కలిసి కృషి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. 

కథేంటంటే:

వ్యాస్‌ (సుమంత్‌) ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టీచర్‌. తనలోని భావాలు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు వైపే ఉంటాయి. విద్యార్థులను సరైన క్రమపద్ధతిలో పెట్టాలంటే బెదిరించడం, భయపెట్టడం కాదని నమ్ముతాడు. మరి ముఖ్యంగా విద్యార్థుల బట్టీ చదువులకు వ్యాస్ మాస్టారు పూర్తి వ్యతిరేకం. కార్పొరేట్ టీచర్స్ తమ స్టూడెంట్స్ ర్యాంకుల కోసం ఒత్తిడి తీసుకురావొద్దని నమ్ముతాడు.

అందుకు స్కూల్ మేనేజ్‌మెంట్‌తో వాదిస్తుంటాడు. అయిన అక్కడెవరు తన మాట వినరు. వ్యాస్‌ భార్య భాగ్య (కాజల్‌ చౌదరి) అదే స్కూల్‌కు ప్రిన్సిపల్. కానీ, తన భర్త మాటలను పట్టించుకోకుండా స్కూల్ మేనేజ్‌మెంట్‌ వైపే మాట్లాడుతుంటుంది. దానితోడు తరుచూ తన భర్త వ్యాస్పై కోప్పడుతుంది.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు ముదురుతాయి. వ్యాస్‌ మాటలను పెడచెవిన పెట్టిన స్కూల్ మేనేజ్‌మెంట్.. అతనిని జాబ్ నుండి తొలగిస్తుంది. కార్పొరేట్ స్కూల్లో ర్యాంకులు రావడానికి.. విద్యార్థులు కేవలం బట్టీ చదువులే చదవాలా... ఇంకెలాంటీ మార్గం లేదా? అని ఆలోచిస్తాడు. అందుకు ఆల్టర్‌ నేట్‌గా ఒక కీలకమైన మార్గాన్ని ఎంచుకుంటాడు వ్యాస్. 

ఈక్రమంలో కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా ఎలాంటి స్టెప్స్ వేశాడు? వ్యాస్కు ఎదురైన సవాళ్లు ఏంటి? వ్యాస్ ఎంచుకున్న మార్గంపై తన భార్య భాగ్యకు ఎలాంటి నిజాలు తెలిసొచ్చాయి? విద్యార్థులను టాపర్లుగా మలచడానికి వ్యాస్ మాస్టర్ చెప్పిన టిప్స్ ఏంటనేది మిగతా స్టోరీ.