ఏటీపీ సింగిల్స్‌‌లో 98 ర్యాంక్‌‌కు చేరుకు న్న సుమిత్‌‌ నగాల్‌‌  

ఏటీపీ సింగిల్స్‌‌లో 98 ర్యాంక్‌‌కు చేరుకు న్న సుమిత్‌‌ నగాల్‌‌   

న్యూఢిల్లీ :  ఇండియా టాప్‌‌ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ సుమిత్‌‌ నగాల్‌‌.. ఏటీపీ సింగిల్స్‌‌ ర్యాంక్‌‌ను మెరుగుపర్చుకున్నాడు. సోమవారం విడు దల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో 23 స్థానాలు ఎగబాకి 98వ ర్యాంక్‌‌కు చేరుకు న్నాడు. నగాల్‌‌ టాప్‌‌–100లో చోటు సం పాదించడం కెరీర్‌‌లో ఇదే తొలిసారి. ప్రజ్నేశ్‌‌ గుణేశ్వరన్‌‌ (2019) తర్వాత వందలోపు ర్యాంక్‌‌ను సాధించిన తొలి ఇండియన్‌‌ ప్లేయర్‌‌గా నిలిచాడు.

చెన్నై ఓపెన్‌‌ టైటిల్‌‌ గెలవడం సుమిత్‌‌ ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదపడింది. ‘టాప్‌‌–100లో చోటు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ కల ఇది. స్వదేశంలో సొంత ఫ్యాన్స్‌‌ ముందు మ్యాచ్‌‌ గెలవడం కూడా. ఇంతకంటే మంచి ప్లేస్‌‌, సందర్భం నాకు రాదనే అనుకుంటున్నా. చాలా భావోద్వేగానికి గురవుతున్నా’ అని నగాల్‌‌ వ్యాఖ్యానించాడు.