
విక్టోరియా (కెనడా): కెనడా టీనేజ్ స్విమ్మర్ సమ్మర్ మెకింతోష్.. మూడు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. మంగళవారం జరిగిన విమెన్స్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేని మెకింతోష్ 2ని, 5.7 సెకన్లలో పూర్తి చేసింది. దాంతో 2015లో హంగేరియన్ గ్రేట్ కటింకా హోస్జు నెలకొల్పిన వరల్డ్ రికార్డు (2ని,06.12 సెకన్లు)ను బ్రేక్ చేసింది. ఇక అంతకుముందు శనివారం జరిగిన 400 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ను మెకింతోష్ 3:54.18 సెకన్లలో ముగించింది. ఫలితంగా ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియార్నే టిట్మస్ నెలకొల్పిన పాత వరల్డ్ రికార్డు (3:55.38 సెకన్లు)ను అధిగమించింది.
ఆదివారం జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో మెకింతోష్ 8:05.07 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సొంత కెనడీయన్ రికార్డు తిరగ రాసింది. మే నెలలో కేటీ లెడెక్కీ నెలకొల్పిన రికార్డు కంటే ఇది 0.95 సెకన్లు తక్కువగా ఉంది. ‘ఒకసారి ఒక్క రేసును మాత్రమే తీసుకుంటున్నా. హీట్స్‌లో మంచి పెర్ఫామెన్స్ రావడంతో ఫైనల్‌లోనూ దాన్ని రిపీట్ చేసేందుకు ప్రయత్నించా’ అని మెకింతోష్ తెలిపింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో మెకింతోష్ మూడు స్వర్ణాలు (400, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 200 మీటర్ల బటర్‌ఫ్లయ్) నెగ్గింది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సిల్వర్‌తో సరిపెట్టుకుంది.