Summer Rains : 4 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Summer Rains : 4 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

మండే ఎండల నుంచి కేరళకు ఉపశమనం లభించింది. 2024, ఏప్రిల్ 12 గురువారం నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ శాఖ శుక్రవారం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 40 కి.మీ వేగంతో మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. 

తిరువనంతపురంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం నుండి తిరువనంతపురం, కొల్లాం జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 64.5 మిమీ నుండి 115.5 మిమీ వరకు వర్షపాతాన్ని సూచిస్తుంది. మిగిలిన 10 జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. 

ఏప్రిల్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వేసవి వర్షాలు కొనసాగుతాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. వర్షాల తర్వాత కేరళలోని త్రిసూర్, పాలక్కాడ్, కోజికోడ్, కన్నూర్, కొల్లాం, అలప్పుజా, కాసర్‌గోడ్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది.

 

കേന്ദ്ര കാലാവസ്ഥാവകുപ്പിന്റെ അടുത്ത 5 ദിവസത്തേക്കുള്ള മഴ സാധ്യത പ്രവചനം. വിവിധ ജില്ലകളിൽ കേന്ദ്ര കാലാവസ്ഥാവകുപ്പ് മഞ്ഞ...

Posted by Kerala State Disaster Management Authority - KSDMA on Friday, April 12, 2024