
రజినీకాంత్(Rajinikanth) ఫ్యాన్స్ గెట్ రెడీ. మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న పవర్ ఫుల్ కాంబో సెట్ అయ్యింది. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిన్నమొన్నటి వరకు క్యాన్సిల్ అయ్యింది అనుకున్న ఈ కాంబోపై క్లారిటీ ఇస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇంతకీ ఆ పవర్ ఫుల్ కాంబోలో ఏంటంటే.. రజినీకాంత్, లోకేష్ కానగరాజ్. ఈ కాంబోలో ఒక సినిమా పడితే బాగుంటుందని రజిని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ ఈ కాంబోలో సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు మేకర్స్. ఈ సెన్సేషనల్ ప్రాజెక్టు ను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇందులో భాగంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇటీవలే జైలర్ తో రజినీకాంత్ కు భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సన్ పిక్చర్స్ సంస్థ రజినీకి మరో సూపర్ హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రజినీకాంత్ కెరీర్ 171వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్టు కు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ న్యూస్ తెలియడంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కాంబోలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ALSO READ :నాదగ్గర అవన్నీ కుదరవ్.. నీకంత లేదమ్మా.. సెకండ్ వీక్ నామినేషన్స్లో రచ్చ
We are happy to announce Superstar @rajinikanth’s #Thalaivar171
— Sun Pictures (@sunpictures) September 11, 2023
Written & Directed by @Dir_Lokesh
An @anirudhofficial musical
Action by @anbariv pic.twitter.com/fNGCUZq1xi
అయితే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం లోకేష్ విజయ్ తలపతితో లియో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కార్తీతో ఖైదీ సీక్వెల్, ఆతరువాత సూర్యతో రోలెక్స్ సినిమాలు చేయనున్నాడు. ఇక మరోపక్క రజినీకాంత్ కూడా తన తరువాత సినిమాను టీజీ జ్ఞానవేల్ తో చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది కాబట్టి రజినీకాంత్, లోకేష్ కానగరాజ్ కాంబోలో సినిమా చూడాటానికి చాలా సమయమే పట్టేలా ఉంది.