హైదరాబాద్, వెలుగు: సుందరం ఫైనాన్స్ గ్రూప్ ఫస్ట్పేరుతో ఒక ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ డెట్ స్ట్రాటజీ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. "ఫస్ట్" అంటే ఫిక్స్‌డ్ ఇన్కమ్ రేటెడ్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. ఇది సంప్రదాయ ఎఫ్ డీ రేట్ల కంటే 300–-400 బేసిస్పాయింట్ల అధిక స్థూల రాబడిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
పోర్ట్‌ఫోలియో ప్రత్యేకంగా రేటెడ్, లిస్టెడ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టడంపై దృష్టి సారిస్తుంది.