లంచం ఇవ్వనందుకే ..నన్ను బద్నాం చేసిండ్రు : సునీల్ కుమార్

లంచం ఇవ్వనందుకే ..నన్ను బద్నాం చేసిండ్రు  : సునీల్ కుమార్

కోటగిరి, వెలుగు: డీసీవో, ఆడిటర్లు కక్ష్యపూరితంగా వ్యవహరించి చేయని అవినీతికి తనను బాధ్యుడ్ని చేశారని కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఆడిటర్ రెండున్నర లక్షలు లంచం డిమాండ్ చేశాడని, లంచం ఇవ్వకపోవడంతోనే డీసీవో తనకు రికవరీ నోటీసులు ఇచ్చారన్నారు. ఈ నోటీసులపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నానన్నారు. సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ను ఉదయం 9 గంటలకే నిర్వహించడంపై సభ్యులు మండిపడ్డారు. 

కొందరు సభ్యులు మీటింగ్ హాల్‌నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, ఓ సభ్యుడు గోదాం షెటర్‌‌ వేశాడు. దీంతో గందరగోళం నెలకొంది. షెటర్ లాగిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తీర్మానం చేశారు.అనంతరం తీర్మానాన్ని ఉపసంహరించు
కున్నారు.