సునీల్​రెడ్డి మంచోడే .. కాంగ్రెస్​ నేతను మెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత

సునీల్​రెడ్డి మంచోడే .. కాంగ్రెస్​ నేతను మెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు : బాల్కొండ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారమవుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, ముత్యాల సునీల్​రెడ్డి మంచోడంటూ ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేశారు. అయితే ఆయన చేరిన పార్టీ మంచిది కాదన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలం చౌట్ పల్లి విలేజ్​లో మంత్రులు ప్రశాంత్​రెడ్డి, ఇంద్రకరణ్​రెడ్డితో కలిసి కవిత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే కామారెడ్డిలో పార్టీ నేతలు ఎమ్మెల్యే గంపగోవర్ధన్, మూజీబుద్దీన్​ కలిశారు. తర్వాత మీడియాతో  మాట్లాడారు. సునీల్​రెడ్డి మన పార్టీలో ఉన్నడు. జాగృతిలో పనిచేసిండు. రైట్ పర్సన్.. కానీ రాంగ్ పార్టీ కాంగ్రెస్​లోకి వెళ్లిండు’ అని అన్నారు. 

పిలవగానే నలుగురికి సాయం చేయొచ్చు కానీ ఏ పార్టీలో ఉన్నాడనే విషయం ముఖ్యమన్నారు. ఎలక్షన్​లో ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ల సీఎం అభ్యర్థి ఎవరో అడగాలన్నారు. ఎన్నికలు అల్కగ తీసుకునేవి కావు. మనరాతలను మనమే రాసుకునేవి. 60 ఏండ్లు ఆగమై స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే గట్టుకు పడుతున్నం. కసి, పట్టుదలతో పనిచేసే లీడర్​ ఉండాలె. ఉట్టి లీడర్లు కాదు గట్టి లీడర్లు కావాలె. అభివృద్ధి ఆగొద్దు, గుండు, గుండుసున్నా కావద్దన్నారు. సీఎం కేసీఆర్​కు మంత్రి ప్రశాంత్​రెడ్డి సైనికుడిలాంటి వ్యక్తని అన్నారు. ప్రశాంత్​రెడ్డికి వేసే ఓటు కేసీఆర్​కు బలమైతదన్నారు. సీఎం కేసీఆర్​నియ్యత్​ బాగుంది కాబట్టే వానలు కురుస్తున్నయన్నారు.

కాంగ్రెస్​ది ఫాల్స్​ డిక్లరేషన్

కాంగ్రెస్​ ప్రకటించింది దళిత డిక్లరేషన్​కాదని, అది ఫాల్స్​ డిక్లరేషన్​ అని కవిత విమర్శించారు. ఎన్నికలొస్తున్నాయనే కాంగ్రెస్ ఎస్సీ డిక్లరేషన్ ​సభ, బీజేపీ రైతు సభ పేరిట ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నా రు. లోకల్ లీడర్లను ప్రజలు నమ్మరనే ఖర్గేను తీసుకొచ్చారని, కాంగ్రెస్ డిక్లరే షన్​లో చెప్పినవన్నీ ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. అమిత్​షా రైతుల గురించి మాట్లాడడం పెద్ద జోక్ అన్నారు. బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో రైతు సదస్సు నిర్వహించిందని ప్రశ్నిం చారు. వ్యూహంలో భాగంగానే  కేసీఆర్​ కామారెడ్డి నుంచి పోటీ చేస్తు న్నారని చెప్పారు. షబ్బీర్​అలీని ఓడిం చేందుకు కేసీఆర్ రావాల్సినంతటి అవసరం లేదని అన్నారు.