రీగ్రిప్​లో సునీల్ ​షెట్టి పెట్టుబడులు

రీగ్రిప్​లో సునీల్ ​షెట్టి పెట్టుబడులు

గురుగ్రామ్​: బాలీవుడ్​ యాక్టర్​ సునీల్​ షెట్టి రీ–ఇంజినీర్డ్​ టైర్​ స్టార్టప్​ రీగ్రిప్​లో పెట్టుబడి పెడుతున్నట్లు శనివారం ప్రకటించారు. వేస్ట్​ తగ్గించడమే కాకుండా, టైర్ల  లైఫ్​సైకిల్​ పెరిగేలా చూసే ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం ఎక్సయిట్​మెంట్​ కలిగిస్తోందని సునీల్​ షెట్టి ఈ సందర్భంగా వెల్లడించారు. సేఫ్టీ ఉండేలా హై క్వాలిటీ టైర్లను ఈ స్టార్టప్​ తయారు చేస్తుంది. ఇన్నొవేషన్​, సస్టెయినబుల్​ ప్రాక్టీసులతో భవిష్యత్​తరాల కోసం బెటర్​ వరల్డ్​ క్రియేట్​ చేయగలుగుతామని షెట్టి పేర్కొన్నారు.

రీఫర్బిష్డ్  ​ టైర్ల బ్రాండ్​లో పెట్టుబడులు విన్​ విన్​ సొల్యూషన్​గా  ఈ స్టార్టప్​లో మొదటి పెట్టుబడిదారుడయిన మహావీర్​ ప్రతాప్​ శర్మ చెప్పారు. సర్క్యూలర్​ ఎకానమీ సూత్రాలను తాము నమ్మడంతో పాటు, ఎన్విరాన్​మెంటల్​ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తామని రీగ్రిప్​ ఫౌండర్​ తుషార్​ సుహాల్క వెల్లడించారు. జర్నీ ఇప్పుడే మొదలైందని, కానీ చాలా కాలం పాటు తమ ప్రభావం ఉండేలా పనిచేస్తామని వివరించారు. క్వాలిటీ గ్రేడ్​ రబ్బర్​తో రీఫర్బిష్డ్​  టైర్లను ఈ స్టార్టప్​ కంపెనీ రీగ్రిప్​ మాన్యుఫాక్చర్​ చేస్తుంది. షీరింగ్​, రీట్రెడింగ్​ ప్రాసెస్​ల ద్వారా టైర్లను తయారు చేస్తామని సుహాల్క చెప్పారు. కొత్త ప్రొడక్టుల రేట్ల ధరలో సగానికే తమ టైర్లు దొరుకుతాయని, చిన్న మీడియం ట్రక్కింగ్​ కంపెనీలు తమ ప్రొడక్టులు వాడతాయని సుహాల్క పేర్కొన్నారు.