పర్వతగిరి(సంగెం), వెలుగు: వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో వడదెబ్బతో ఓ వృద్ధుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన గుండు వెంకటనర్సు(58) సోమవారం ఉపాధి హామీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు
తెలిపారు.
