Thalaivar 171: తలైవార్ 171 అప్డేట్.. క్రేజీ కాంబో కోసం పవర్ఫుల్ టైటిల్?

Thalaivar 171: తలైవార్ 171 అప్డేట్.. క్రేజీ కాంబో కోసం పవర్ఫుల్ టైటిల్?

జైలర్(Jailer) సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth). చాలా రోజుల తరువాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అనుకున్నారు రజిని. ఈ సినిమా అందించిన ఊపుతోనే ఇప్పుడు వరుసగా క్రేజీ సినిమాలను లైన్లో పెడుతున్నారు సూపర్ స్టార్. అందులో భాగంగా  ఇప్పటికే టీజీ జ్ఞానవేల్(TG Gnanavel) తో వెట్టయ్యాన్ సినిమాను మొదలుపెట్టిన ఆయన.. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తో మరో సినిమాను మొదలుపెట్టారు. తలైవార్ 171(Thalaivar 171) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ చాలారోజుల క్రితమే వచ్చింది. 

విక్రమ్, లియో బ్లాక్ బస్టర్ తరువాత లోకేష్ రజినీతో చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. కాగా.. ఇటీవలే ఈ సినిమా నుండి రజినీకాంత్ కి సంబందించిన ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. చేతులకు బంగారు వాచీలతో భేడీలు వేసిన ఫోటో చాలా కొత్తగా ఉంది. ఈ లుక్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. ఏప్రిల్ 22న టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. 

దీంతో రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టనున్నారు అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. గ్యాంగ్ స్టార్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు కళుగు అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. కళుగు అంటే ఇంగ్లీష్ లో ఈగల్ అని అర్థం. అందుకే.. ఈ సినిమా థీమ్ కు సెట్ అయ్యేలా కళుగు అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారట. ఈ టైటిల్ పట్ల సూపర్ స్టార్ ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి మొదలుకానుందని టాక్. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.