
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి కాంట్రవర్సియల్ తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు మహిళా జడ్జి పుష్ప గనేడివాలాపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బెంచ్‌లో న్యాయమూర్తిగా ఉన్న ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని ఈ నెల 20న కొలీజియం సిఫార్సు చేసింది. ఇప్పుడు దాన్ని వెనక్కు తీసుకున్నట్లు కోర్టు వర్గాలు చెప్పాయి. చర్మం చర్మానికి తగిలితేనే లైంగిక వేధింపుల కింద వస్తుందని, మైనర్ బాలిక ముందు ప్యాంట్ జిప్పు తీయడం లైంగిక వేధింపుల కిందకు రాదని ఆమె తీర్పు చెప్పారు. వీటిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
For More News..